twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుకోకుండా జరిగిందన్న పవన్, అన్నయ్య గురించి..

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: జీవితంలో కొన్ని మనం ఊహించకుండానే అలా జరిగి పోతుంటాయి. పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఇలాంటివి జరిగాయి. సంక్రాంతి సందర్భంగా ఆయన ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అదే విధంగా ‘గోపాల గోపాల' చిత్రం గురించిన అంశాలపై కూడా మాట్లాడారు.

    తాను అసలు సినిమా యాక్టర్ అవుతానని ఊహించలేదని, చిన్నతనంలో కూడా తనకు అలాంటి ఆలోచన అసలు ఉండేది కాదని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అనుకోకుండా ఇటు వచ్చేయడం, ఇందులోనే సెటిల్ అయిపోవడం జరిగిందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.

    వెంకటేష్ తో తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ...‘వెంకటేష్ గారిని నేను నా అన్నయ్యలా ఫీలవుతాను. మా ఇళ్లు కూడా దగ్గరరే ఉంటాయి. చిన్నతనం నుండి ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఆయనతో కలిసి ఇలా మల్టీ స్టారర్ చేస్తామని అనుకోలేదు. నాకు అలాంటి చేయాలనే ఆలోచన కూడా ఉండదు. ఇది స్క్రిప్టు కుదిరింది కాబట్టి చేసాం' అని తెలిపారు.

    I have never thought of I would be a hero: Pawan Kalyan

    జీవితంలో హార్డ్ వర్క్ గురించిన ప్రస్తావన వచ్చినపుడు అన్నయ్య చిరంజీవి ప్రస్తావన తెచ్చిన పవన్....కేవలం హార్డ్ వర్క్ వల్లనే పరిశ్రమలో పైకొస్తాం. అన్నయ్య గారు, ఎన్టీఆర్, ఎఎన్ఆర్, షారుక్ ఖాన్, అజిత్ ఇలా చాలా మంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారు ఇందుకు మంచి ఉదాహరణ. నేను చిరంజీవి బ్రదర్ అయినప్పటికీ ఈ పొజిసన్ రావడానికి నా వంతు హార్డ్ వర్క్ చేసాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

    English summary
    Pawan says "I feel Venkatesh garu as my brother. Since his house was just on back of our house, I have had good rapport with him since my childhood. I have never thought of I would be a hero."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X