ఇదీ విషయం: రామ్ గోపాల్ వర్మ విడాకులకు, గజల్ శ్రీనివాస్‌కు లింకేంటి?
రామ్ గోపాల్ వర్మ తన భార్యతో విడాకులు తీసుకోవడానికి, గజల్ శ్రీనివాస్‌కు ఏమైనా లింక్ ఉందా? ఈ విషయం కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఈ ప్రచారంలో నిజం ఎంతో కానీ చాలా రోజులుగా ఇది సమాధానం లేని ప్రశ్నగానే ఉండిపోయింది. ఈ వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో గజల్ శ్రీనివాస్ స్పందించారు.
నాకు రామ్ గోపాల్ వర్మతో ఈ మధ్య కాలంలోనే పరిచయం, ఆయన విడాకులకు, నాకు ఎలాంటి సంబంధం లేదు అని గజల్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. వర్మగారు నా గురించి మాట్లాడలేదు, వాస్తవానికి ఆయన మాట్లాడింది ఒకటి, జనం అర్థం చేసుకుంది మరొకటి అని తెలిపారు.

అక్కడ గజల్ అంటే నేను కాదు
‘ఎటాక్' అనే సినిమా కోసం నేను ప్లేబ్యాక్ పాడాను. నేను పాడిన ఒకే ఒక ప్లేబ్యాక్ పాట అది. ఆ సమయంలో వర్మ గారు ఓ విషయం చెప్పారు. ‘నాకు గజల్ అంటే అసహ్యం, మా ఆవిడకు గజల్ అంటే చాలా ఇష్టం' అన్నారు. అక్కడ గజల్ అంటే నేను కాదు, ఆమెకు గజల్ సంగీతం అంటే ఇష్టమని ఆయన మాటల్లోన అర్థం అని గజల్ శ్రీనివాస్ తెలిపారు.

గజల్స్ కారణమని చెప్పాడు, నేను కాదు...
ఆమె అస్తమానం గజల్స్ పెట్టేది, నాకేమో చిరాకు వచ్చేది. మా ఇద్దరి మధ్య విడాకులు రావడానికి కారణం గజల్స్ అని చెప్పాడే తప్ప... నేను కారణమని వర్మగారు ఎప్పుడూ చెప్పలేదని శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. నేను రామ్ గోపాల్ వర్మ భార్యను ఇప్పటి వరకు చూడలేదని వెల్లడించారు.

నాకు ఎలాంటి వ్యసనాలు లేవు
వర్మగారితో అప్పుడప్పుడూ వాట్సాప్ చాటింగ్ చేస్తుంటాను, సరదాగా కలవాలంటే ఏదైనా హోటల్‌లో కూర్చుంటాము. నేను డ్రింక్ చేయడం కానీ, ఇతర వ్యసనాలు ఏమీలేవు. అందుకే నేను పబ్బులకు కూడా వెళ్లను. వెళ్లాల్సిన అవసరం వస్తే దయచేసి నన్ను డ్రింక్ చేసే చోట కూర్చోపెట్టవద్దు, నేను ఎప్పుడూ తాగలేదు, పేకాట ఆడలేదు అని చెబుతుంటాను. నాకు నాన్ వెజ్ తినే అలవాటు కూడ లేదిన ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ తెలిపారు.

వర్మ గొప్ప దర్శకుడు
రామ్ గోపాల్ వర్మగారిని ఒక దర్శకుడిగా నేను చాలా ఇష్టపడతాను. ఆయన ఒక గొప్ప డైరెక్టర్. విజువలైజేషన్ చాలా బావుంటుంది. ఒక వంద మంది గ్రేట్ డైరెక్టర్ల లిస్టు ఉంటే అందులో అందరికంటే ముందు ఉండే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అని గజల్ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











