నాగార్జున మాజీ లవ్వర్ టబు షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్: గ్రీకువీరుడు, నా రాకుమారుడు..అంటూ నాగార్జునకి దగ్గరైన టబు ఆయనతో తర్వాత పలు హిట్ చిత్రాలు చేసింది. స్క్రీన్ పై వీరి రొమాన్స్ బాగా పండాయి. నిజ జీవితంలో కూడా ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. టబు నా క్లోజ్ ఫ్రెండ్ అని నాగార్జున కూడా పలు సందర్భాల్లో చెప్పడంతో..... ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే గుసగుసలు చాలా వినిపించాయి.
నాగార్జున భార్య అమలతో పాటు, అక్కినేని కుటుంబం టబుతో చాలా సన్నిహితంగా ఉండటం, టబు హైదరాబాద్ వస్తే మా ఇంట్లోనే ఉంటుందని నాగార్జున గతంలో చెప్పడంతో.....నాగ్-టబు మధ్య బంధం చాలా దూరం వెళ్లిందనే అంతా అనుకున్నారు. టబు కోసం నాగార్జున హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఇల్లు కొని పెట్టాడని, అన్ని పనులు స్వయంగా దగ్గరుండి చూసుకున్నాడనే గాసిప్స్ వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో టబు హైదరాబాద్ లోనే సెటిల్ అవుతుందనే వార్తలు కూడా ఆ మధ్య ప్రముఖంగా వినిపించాయి.
అయితే ఆ వార్తలను ఖండిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది టబు. తాజాగా ఆమె ముంబైలో మీడియాతో మాట్లాడుతూ తాను హైదరాబాద్ షిప్ట్ అవుతాననే వార్తల్లో నిజం లేదని, ముంబైలోనే ఉంటానని తేల్చి చెప్పింది. నాగార్జున తనకు మంచి స్నేహితుడని, అంతకుమించి మరేమీ లేదని టబు స్పష్టం చేసింది.
ఏజ్ బార్ అవడంతో హీరోయిన్ అవకాశాలు తగ్గి పోయిన టబు ఇతర పాత్రలు చేస్తూ తెరపై తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఆమె హిందీలో 'బండా యే బిందాస్ హై', 'డేవిడ్', ఇంగ్లీష్ లో 'లైఫ్ ఆఫ్ పి' అనే చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











