For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌తో చేసే తీరిక లేదన్న సమంత

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కెరీర్లో ఇప్పటి వరకు అపజయం అంటూ లేకుండా హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న సమంత ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా అమ్మడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోయే పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు ఇటీవల గాసిప్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను సమంత ఖండించింది.

    ప్రస్తుతం తాను చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నానని, వచ్చే ఏడాది వరకు తన డేట్స్ ఖాళీగా లేవని స్పష్టం చేసింది. 'గతంలో కమిట్ అయిన సినిమాలే చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ కొత్త సినిమాకు సైన్ చేయలేదు. చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యే వరకు ఎవరికీ డేట్స్ ఇవ్వదలుచుకోలేదు' అని స్పష్టం చేసింది.

    ఇటీవల సమంత నటించిన ఈగ చిత్రం సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణం కొంత కాలంగా షూటింగులకు దూరమైన సమంత ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడటంతో మళ్లీ షూటింగులకు హాజరవుతోంది. సమంత ప్రస్తుతం బోలెడు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.

    గౌతం మీనన్ దర్శకత్వంలో నాని సరసన ఎటోవెళ్లి పోయింది మనసు, దేవా కట్ట దర్శకత్వంలో నాగచైతన్య సరసన ఆటో నగర్ సూర్య, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నందినిరెడ్డి దర్శకత్వంలో సిద్ధార్థ సరసన ఓ సినిమా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన ఎవడు చిత్రాల్లో నటిస్తోంది.

    English summary
    "I have not signed any new films. I will not take up a new project until I'm done with the projects on hand," Samantha says. Samantha rubbished reports that claimed she has signed up to play the lead opposite Pawan in his next flick to be directed by Trivikram Srinivas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X