రామ్ చరణ్ ‘రచ్చ’ సీక్వెల్ డీటేల్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'రచ్చ' చిత్రం మెగా బ్లాక్ బస్టర్‌గా విజయవంతం అయిన సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈచిత్రం పలు తెలుగు సినిమా రికార్డులను తిరగ రాసింది. తాజాగా ఈచిత్రానికి సీక్వెల్ రూపొందించే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు సంపత్ నంది.
ఈ విషయమై స్వయంగా సంపత్ నంది వెల్లడిస్తూ....ప్రస్తుతం స్ర్కిప్టు వర్కు జరుగుతోందని, రచ్చ చిత్రాన్ని మించిన ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ రచ్చ2 తీర్చిదిద్దుతున్నా, తనకు దీనిపై పూర్తి నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రొడ్యూసర్ సనమ్ నాగ అశోక్ కుమార్ న్యూ సినిమాకు పని చేస్తున్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.
ఇక రచ్చ చిత్రం ఇటీవల 50 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం 127 సెంటర్లలో 50 రోజులు ఆడిన తొలి సినిమాగా 'రచ్చ' చిత్రం రికార్డు సృష్టించింది. మరో వైపు భారీ కలెక్షన్లతో టాలీవుడ్ టాప్ 3 గ్రాసర్లలో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది. ఆరెంజ్ చిత్రం ప్లాపుతో కాస్త వెనక బడ్డ చరణ్ 'రచ్చ'తో మళ్లీ పుంజుకున్నాడు.
తాజాగా... రామ్ చరణ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంతో పాటు... బాలీవుడ్‌లో అపూర్వ లఖియా దర్శకత్వంలో'జంజీర్' చిత్రంలో నటిస్తున్నాడు. మరో వైపు కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడిగా పేరున్న వివి వినాయక్ దర్శకత్వంలోనూ ఓ చిత్రానికి కమిట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











