‘నాయక్’ ఎఫెక్ట్.... ఓవర్ నైట్ స్టారైన మెంటల్ కృష్ణ!
హైదరాబాద్: మెంటల్ కృష్ణ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ఒకే రోజు ఏకంగా 12 సినిమాలకు సైన్ చేసాడు. అయితే ఇదంతా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా సినిమా 'నాయక్' సినిమా ఎఫెక్టే. ఈ చిత్రంలో శుక్లా భాయ్ పాత్రలో తనదైన నటనతో అందరికీ ఆకట్టుకున్న పోసాని కృష్ణ మురళికి..... ఆఫర్లు వరదలా వచ్చి పడ్డాయి.
ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో పోసాని మాట్లాడుతూ.... ఈ విషయాన్ని ఖరారు చేసారు. 'నాయక్ సినిమా రిలీజైన రెండు రోజుల్లో 12 సినిమాలకు సైన్ చేసాను. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ మూవీ, మహేష్ బాబు, క్రిష్ కాంబినేషన్లో వచ్చే సినిమాతో పాటు, రాఘవేంద్రరావు 'ఇంటింటా అన్నమయ్య', అల్లు అర్జున్ తో ఓ సినిమా, రామానాయుడు ప్రొడక్షన్స్ సినిమాతో పాటు మొత్తం డజను చిత్రాలకు సైన్ చేసాను. రచయితగా కూడా అవకాశాలు మరింత పెరిగాయి' అని చెప్పుకొచ్చారు పోసాని.
రచయితగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పోసాని దాదాపు 40 సినిమాలకు కథఆ రచయితగా, మాటల రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేసారు. అనంతరం నటుడిగా మారి ఇప్పటి వరకు 38 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కొన్ని చిత్రాల్లో హీరో రేంజి ప్రధాన పాత్రలో చేసారు. దాదాపు అరడజనుకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా పెద్దగా హిట్లు రాక పోవడం, నటుడిగా తనకు డిమాండ్ పెరగడంతో వరుస చిత్రాలకు సైన్ చేస్తున్నాడు పోసాని.
పోసాని ఇటీవల నటించిన పలు చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. వేదం సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో టాక్సీ డ్రైవర్ పాత్ర, నాయక్ చిత్రంలో శుక్లా భాయ్‌గా సైడ్ విలన్ పాత్రలు..... ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నేపథ్యంలో పలువురు దర్శకులు తమ సినిమాల్లో పోసాని కోసం ప్రత్యేకమైన సీన్లను రెడీ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











