twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దారుణమైన సక్సెస్ రేటు నాది: నిజాయితీగా చెప్పేసిన రామ్ పోతినేని

    "ఉన్నది ఒకటే జిందగీ" ప్రమోషన్లలో భాగంగా రామ్ మాట్లాడుతూ.. హీరోగా తన సక్సెస్ రేట్ చాలా దారుణమని అన్నాడు. అయితే ఈ పరాజయాల నుంచి తాను పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతున్నట్లు రామ్ తెలిపాడు. తన కొత్త సిని

    |

    రామ్ వెండి తెరమీదకి అడుగుపెట్టి దాదాపు పదేళ్ళు కావస్తోంది. కానీ ఇప్పటికీ కెరీర్ బెస్ట్ అన్నంత పెద్ద హిట్ మాత్రం ఇప్పటికీ పడలేదు. ఖాతాలో ఉన్న హిట్ లు కూడా నటనా పరంగా గొప్ప సంతృప్తినిచ్చేవీకాదు, ఒక సక్సెస్ ఒక ఫెయిల్యూర్ అన్నట్టు మధ్యస్తంగా సాగిపోతున్నాడు ఈ క్యూట్ హీరో. అందులోనూ ఈమధ్య వచ్చిన యువహీరోలతో కాంపిటీషన్ కూడా విపరీతంగా పెరిగి పోవటం తో పాపం కాస్త కష్టంగానే నెగ్గుకు రావాల్సి వస్తోంది.

    Recommended Video

    ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ ట్రైలర్ "Vunnadi Okate Zindagi" Audio And Trailer Released
    ఫెయిల్యూర్ లని నిజాయితీగా ఒప్పుకున్నాడు

    ఫెయిల్యూర్ లని నిజాయితీగా ఒప్పుకున్నాడు

    ఇప్పుడు తాను చేయబోతున్న సినిమా మీద నమ్మకంగానే ఉన్నా పాత ఫెయిల్యూర్ల తాలుకు భయం మాత్రం ఇంకాపోనట్టేఉంది. అందుకే ఇక మీదట కెరీర్ విషయం లో కాస్త సీరియస్ గానే ఉండాలని నిర్ణయించుకున్నట్టుంది. అయితే మరీ తీసిపారేయదగ్గ హీరో ఏమీకాదు, అందునా మంచి బ్యాగ్ గ్రౌండ్ కూడా ఉంది.., అయినా ఎప్పుడూ కూడా ఏ విశయం లోనూ గర్వాన్ని చూపించడు రామ్, తన ఫెయిల్యూర్ లని నిజాయితీగా ఒప్పుకున్నాడు.

    నా సక్సెస్ రేట్ చాలా దారుణం

    నా సక్సెస్ రేట్ చాలా దారుణం

    ఇకమీదట జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నట్టుకూడా చెప్పాడీ ఎనర్జిటిక్ హీరో. ‘ఉన్నది ఒకటే జిందగీ' ప్రమోషన్లలో భాగంగా రామ్ మాట్లాడుతూ.. హీరోగా తన సక్సెస్ రేట్ చాలా దారుణమని అన్నాడు. అయితే ఈ పరాజయాల నుంచి తాను పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతున్నట్లు రామ్ తెలిపాడు. తన కొత్త సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ' కచ్చితంగా విజయం సాధిస్తుందని రామ్ ధీమా వ్యక్తం చేశాడు.

    ఉన్నది ఒకటే జిందగీ

    ఉన్నది ఒకటే జిందగీ

    తన కెరీర్లో ‘ఉన్నది ఒకటే జిందగీ' ప్రత్యేకమైన సినిమా అని.. తనకు ఇది ఎంతో సంతృప్తిని ఇచ్చిందని రామ్ చెప్పాడు. దర్శకుడు కిషోర్ తిరుమల తనకు ఏం చెప్పాడో అది తీశాడని.. అతడి పనితీరుపై చాలా సంతృప్తిగా ఉన్నానని.. తమ ఇద్దరికీ బోనస్‌ లాగా ఈ సినిమా సక్సెస్ రాబోతోందని చెప్పాడు రామ్. ‘నేను శైలజ' తర్వాత రామ్-కిషోర్ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ'.

     లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్

    లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్

    రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రామ్ సరసన లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో గోల్డెన్ లెగ్ పిల్ల అనుపమా పరమేశ్వరన్ కూడా ఉండటంతో వరుస హిట్లు తెచ్చుకున్న అనుపమ సెంటిమెంట్ కూడా వర్క్ ఔట్ అవుతుందేమో చూద్దాం.

    English summary
    “I have a terrible success rate and I think it’s a learning process,” hero Ram Pothineni says candidly. Reuniting with a successful combo that produced Nenu Sailaja, he doesn’t feel burdened by expectations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X