పవన్, చెర్రీ నెక్ట్స్ ప్రాజెక్టుల్లో లేనంటూ...సమంత క్లారిటీ
అయితే ఈ వార్తల్లో నిజం లేదని తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది సమంత. 'ఇప్పటికే చాలా ప్రాజెక్టులకు కమిట్ అయి ఎక్కవగా పని చేస్తున్నాను. ఇప్పటి వరకు ఇంకా ఏ కొత్త సినిమాకు సైన్ చేయలేదు. అసలు ఈ సంవత్సరం ఏ సినిమాకు కూడా సైన్ చేయాలనే ఆలోచన లేదు' అని ట్వీట్ చేసింది.
'ప్రస్తుతం తాను రామయ్యా వస్తావయ్యా, అత్తారింటికి దారేది సినిమాల్లో నటిస్తున్నాను. అక్కినేని ఫ్యామిలీతో రూపొందబోతున్న 'మనం' సినిమా వచ్చే నెల ప్రారంభం కాబోతోంది. అదే విధంగా జూ ఎన్టీఆర్ 'రభస' చిత్రంలోనూ చేయబోతున్నాను. ఆగస్టు నెలలో సూర్య-లింగుస్వామి సినిమా ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత వివి వినాయక్ సినిమా చేయబోతున్నాను' అని వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం ఇక ఏ కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు అంటూ...అభిమానులకు స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది ఈ సెక్సీ లేడీ. ప్రస్తుతానికి సమంత కొత్త సినిమాలు ఒప్పుకోకపోయినా ఆమె నటించిన సినిమాలు త్వరలో వరుస పెట్టి విడుదల కాబోతున్నాయన్నమాట.


Click it and Unblock the Notifications












