బాలయ్యతో చేయడం లేదు : మిస్ ఇండియా
ఇలా ప్రచారం జరుగడంపై తాజా ఎరికా ఫెర్నాండేజ్ స్పందించారు. తాను బాలకృష్ణ సినిమాలో నటించడం లేదని, బాలకృష్ణతో ఏ తెలుగు సినిమాకు కమిట్ కాలేదని, అదంతా అసత్య ప్రచారమే అని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసారు. ప్రస్తుతం ఈ భామ తెలుగులో 'డేగ' అనే చిత్రం నటిస్తోంది.
మరి ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యేది ఎవరో తేలాల్సి ఉంది. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థ ఈచిత్రాన్ని ప్రొడక్షన్ నెం.4గా నిర్మిస్తోంది. హైదరాబాద్‌లోని 14రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ కార్యాలయంలో పార్మల్ పూజా కార్యక్రమం జూన్ 3వ తేదీనే జరిగింది. బాలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని జూన్ 10న షూటింగ్ ప్రారంభమైంది.
ఈ చిత్రానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమా గురించి దర్శకుడు ఇటీవల మాట్లాడుతూ.... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అంటున్నారు బోయపాటి.


Click it and Unblock the Notifications












