విష్ యు ఆల్ ఎ సాడ్ ఇయర్ అంటూ....వర్మ
హైదరాబాద్: నూతన సంవత్సర సంబరాల నేపథ్యంలో అందరూ సంతోషంగా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటే.....వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం అందరికీ విష్ యూ ఎ సాడ్ ఇయర్ అంటూ ట్వీట్ చేసాడు.
‘మనం ఎప్పుడూ నూతన సంవత్సరంలోకి పాత సంవత్సరానికి సంబంధించిన మన బాధలను కూడా తీసుకెలుతున్నాం. అందుకే నేను అందరికీ సాడ్ ఇయర్ అంటూ విష్ చేస్తున్నాను' అంటూ ట్వీట్ చేసారు. అయితే ప్రజలు ఎప్పటికీ కేవలం నమ్మకంతో జీవిస్తున్నారు. వారికి లాజిక్ తెలియదు. అందుకే హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ కూడా చెబుతున్నాను అంటూ మరో ట్వీట్ చేసాడు
రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తులు ఇలా మాట్లాడటంలో వింతేమీ లేదనుకోండి. ఎందుకంటే మనోడి ఆలోచన విధానం కాస్త తేడా కాబట్టి ఆయన నుండి ఇలాంటి మాటలు వినడం ఎవరికీ ఆశ్చర్యం అనిపించడం లేదు. సినిమా రంగంలో అందరిదీ ఓ దారైతే ఆయనది మరో దారి, ఎడ్డం అంటే తెడ్డం అనే రకం.

వివాదాలతో సావాసం చేయడం, నా ఇష్టం చెత్త సినిమాలే తీస్తా....చూస్తే చూడండి లేకుంటే మానండి అని తెగేసి చెప్పడం ఆయన స్టైల్. పబ్లిసిటీ కోసమే ఆయన ఇలా వంకర వేషాలు వేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే.


Click it and Unblock the Notifications











