»   » ట్రైనర్ ని పెట్టుకుని మహేష్ బాబు

ట్రైనర్ ని పెట్టుకుని మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు తన బాడీ ఫిటెనెస్ కోసం పర్శనల్ గా ఫిజికల్ ట్రైనర్ ని నియమించుకున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ...శరీరాన్ని క్రమ పద్దతిలో సన్నగా ఉంచటం చాలా కష్టమైన పని. ఎప్పుడైనా రిలాక్స్ అయితే బరువు పెరిగిపోతాం. అందుకే నేను కొద్ది నెలలు క్రిందట ఓ ట్రైనర్ ని పెట్టుకున్నాను. అతను నా చేత కొంత ఫిటెనెస్ ఎక్సరసైజులు చేయిస్తున్నాడు..అవి ఇబ్బందిగా ఉన్నా ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే ఫిటెనెస్ కి ఆహారం అతి ముఖ్యం. ఎంత జాగ్రత్తగా ఉనవ్నా ఒక్కసారి రెగ్యులర్ ఫుడ్ ని మిస్ చేసుకుంటూంటాం.

ఇక నేను వ్యక్తిగతంగా రకరకాల వంటకాలను ఇష్టపడుతూంటాను. ఆదివారాలప్పుడు నాకిష్టమైన ఫుడ్ తీసుకుని, మిగతారోజుల్లో క్రమ పద్దతిగా ఉంటాను అన్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు..దూకుడు చిత్రం చేస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందే ఆ చిత్రం కామిడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో మహేష్ ఓ పోలీస్ ఆపీసర్ గా కనిపించనున్నారు. ఆ పాత్ర ఫిట్ నెస్ గా కనిపించటం కోసం ఇలా ట్రైనర్ ని పెట్టుకుని మరీ మహేష్ కష్టపడుతున్నారు.

English summary
Mahesh Babu, who has hired a trainer, says, “It is very difficult to maintain a lean frame. If we relax a bit we could put on weight. So, a few months ago, I hired a trainer and he has put me on a rigorous fitness regimen but I am enjoying it.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu