For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సొంత తమ్ముడు సెక్స్ లైఫ్ కు ఎడ్వైజ్ ఇచ్చిన స్టార్ హీరోయిన్, అంతా షాక్

  By Srikanya
  |

  ముంబై: ఇది సెన్సేషన్ కాలం, సామాన్యుల సంగతి ఎలా ఉన్నా సెలబ్రెటీలకు సెన్సేషన్ లేకపోతే పొద్దు పొడవటం లేదు పొద్దుకూగటం లేదు. దాంతో మీడియావారు సెన్షేషన్ న్యూస్ కోసం వెతుక్కున్నట్లుగా సెలబ్రెటీలు, ముఖ్యంగా సినిమా జనం సెన్షేషన్ ఏది అవుతుందో దాన్నే ఆలోచించి వదలుతున్నారు.

  ఇంతకు ముందు రామ్ గోపాల్ వర్మ ఒక్కడే ఈ సెన్షేషన్ పబ్లిసిటీకు ఆధ్యుడుగా కనపడ్డారు. కానీ కాలం మారింది. హీరోలు, హీరోయిన్స్ అందరూ సెన్షేషన్ క్రియేట్ చేసుకుని కలెక్షన్స్ పెంచుకునే దిసగా అడుగులు వేస్తున్నారు. బాలీవుడ్ లో ఈ సెన్సేషనలిజం మరీ ఎక్కువైపోయింది.

  ముఖ్యంగా రాధికా ఆప్టే, కంగనా రనత్ వంటి హీరోయిన్స్ నోరు విప్పితే ఏం వస్తుందా వారి నుంచి అన్నట్లుగా మీడియా ఎదురుచూసే పరిస్దితి క్రియేట్ చేసేసారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో సోనమ్ కపూర్ కూడా చేరుతోంది. తాజాగా ఆమె నేహాధూపియా షో ..నో ఫిల్టర్ నేహాలో మాట్లాడిన మాటలు మీడియాలోనే కాదు ఇండస్ట్రీలోనూ హవ్వ ..ఇదేంటి సోనమ్ ఇలా మాట్లాడింది అనుకునేలా హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఆమె మాట్లాడింది అంటారా..

  ఇలాంటి అమ్మాయిల వెనక పడతాడేం

  ఇలాంటి అమ్మాయిల వెనక పడతాడేం

  సోనమ్ కపూర్ తన సోదరుడు హర్షవర్ధన్ కపూర్ గురించి మాట్లాడుతూ... తన సోదురుడు అమ్మాయిల విషయంలో చాలా బ్యాడ్ టేస్ట్ తో ఉంటాడని కామెంట్ చేసి షాక్ ఇచ్చింది. అసలు తన సోదరుడు పర్శనల్ లైఫ్ గురించి సాధారణంగా ఎవరూ మాట్లాడటానికి సాహసించరు కానీ సోనమ్ నోరు విప్పి ఇలా అనేసింది.

  అమ్మాయిల విషయం లో దారుణం

  అమ్మాయిల విషయం లో దారుణం

  వాడిది అమ్మాయిల విషయంలో చాలా దారుణమైన టేస్ట్. నేను వాడికి ఇది డైరక్ట్ గా చెప్పలేను. వాడు ఎప్పుడు ఏమనుకుంటాడంటే నా లాగ, రేహా లాగ ఉండే వాళ్లతో డేటింగ్ చేయకూడదని, అంతవరకే ఆలోచిస్తాడు అంది.

  ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమని అక్కలు సూచన

  ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమని అక్కలు సూచన

  సోనమ్, ఆమె సోదరి రేహా కపూర్ కూడా తమ తమ్ముడు హర్ష విషయంలో చాలా కన్సర్న్ గా ఉంటారట. వాళ్లు ఎంత కేర్ తీసుకుంటారంటే తమ తమ్ముడు డేటింగ్ చేసే అమ్మాయిలను కూడా గమనిస్తాంటూంటారట. అంతేకాకూండా ఆవిషయంలో సూచనలు ,సలహాలు కూడా అందచేస్తారట.

  ప్రొటక్షన్ వాడమంటూ తమ్ముడుకి

  ప్రొటక్షన్ వాడమంటూ తమ్ముడుకి

  ఏ అక్కలైనా తమ తమ్ముడుకి సెక్స్ వల్ లైఫ్ గురించి సలహాలు ఇస్తారా..కానీ సోనమ్ , ఆమె సోదరి మాత్రం ఆ బాధ్యత కూడా తీసుకుంటారట. వాళ్లు తమ తమ్ముడుని ప్రొటక్షన్ వాడమని చెప్తారట. ఈ విషయం సోనమ్ చెప్పింది షోలో.

  దారుణం అనిపిస్తోందా...ఈ మెసేజ్ చదివితే

  దారుణం అనిపిస్తోందా...ఈ మెసేజ్ చదివితే

  తమ తమ్ముడు సెల్ కు ...అమ్మాయిల విషయంలో వాళ్లు పంపిన మెసేజ్ లలో ఒకదాన్ని ఆ షో ని హోస్ట్ చేస్తున్న నేహా చదివి వినిపించింది. ఆమె స్వీట్ గానే ఉంది కానీ, టాస్కీ, నాట్ బ్యాడ్, నువ్వు ప్రొటక్షన్ మాత్రం వాడు. అయినా అమ్మాయి ల విషయంలో నీది ఇంత బ్యాడ్ టేస్ట్ ఏంటి.. అని తమ్ముడుకి ఇచ్చిన మెసేజ్ లో ఉంది.

  సోనమ్ డైరక్టర్స్ షాక్

  సోనమ్ డైరక్టర్స్ షాక్

  సోనమ్ తమ్ముడు హర్ష ఎంత అల్లరి వాడంటే...ఆమె ఫోన్ తీసుకుని, దాని ద్వారా ..స్టార్ డైరక్టర్ కు మీతో నేను పని చేయాలని ఉంది అని తమ అక్క పంపినట్లుగా మెసేజ్ లు పంపుతాడట. ఆమెకు తెలియకుండా ఇది జరుగుతుంది. దాంతో ఆ తర్వాత ఆ డైరక్టర్స్ నుంచి ఫోన్స్ వస్తాయట. ఇదంతా తమాషాగా తమను ఆటపట్టించటానికి చేస్తూంటాడని సోనమ్ చెప్పింది.

  తన అక్క కెరీర్ తో ఆడేసుకుంటున్నాడు

  తన అక్క కెరీర్ తో ఆడేసుకుంటున్నాడు

  హర్ష రీసెంట్ గా ఓ షోలో మాట్లాడుతూ... తను కనుక తన అక్క సోనమ్ ప్లేస్ లో ఉంటే కనుక, ధాంక్యూ, ప్లేయర్స్ వంటి సినిమాలు పొరపాటున కూడా చేయనని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇది విన్న సోనమ్ మండిపడింది.. ఆమె చాలా డిప్లమెటిక్ గా ఉందామనుకుంటే తమ్ముడేమో ఇలా గాలి తీసేసే పోగ్రామ్ లు పెట్టుకుంటాడాయె.

  తమ్ముడు మాటలకు అక్క కవర్ చేయలేక ..

  తమ్ముడు మాటలకు అక్క కవర్ చేయలేక ..

  తమ్ముడు హర్ష నోటికివచ్చినట్లు మాట్లాడగానే తన కెరీర్ కు డామేజ్ అయ్యిందని బావించిన సోనమ్ వెంటనే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. అబ్బాస్ మస్తాన్ సార్ మీరు అంటే మాకు ఇష్టం. ఆరెండు సినిమాలు సంగతి వదిలేయండి అంటూ రిక్వెస్ట్ చేసింది.

  మా నాన్నే నా కెరీర్ లో సమస్య

  మా నాన్నే నా కెరీర్ లో సమస్య

  తన కెరీర్ ఇలా ఉండడానికి తన తండ్రే కారణమని అంటోంది. అవును... అనిల్ కపూర్ కూతురు కావడం వల్లే తనకు చాలా ఛాన్సులు చేతికందకుండా పోయాయని సోనమ్ ఆవేదన వ్యక్తం చేస్తుంది.

  ఫ్రెండ్ కూతురుతో రొమాన్సా

  ఫ్రెండ్ కూతురుతో రొమాన్సా

  తాను అనీల్ కపూర్ కూతురు అవ్వడం వల్ల ప్రేమ్ రతన్ ధన్ పాయో కూడా తన చేతినుంచి జారిపోయే పరిస్థితి వచ్చిందట. సల్మాన్ సోనమ్ సరసన నటించననివ్నటించనని తెగేసి చెప్పాడని చివరికి ఎలాగోలా కష్టపడి అంతా బతిమాలితే అప్పుడు ఒప్పుకున్నాడని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై సల్మాన్ మరో ఉద్దేశంతో సోనమ్ ని వద్దు అనలేదట... "అనిల్ కపూర్ నా క్లోజ్ ఫ్రెండ్. అతడి కుమార్తెతో నేను ఎలా రొమాన్స్ చేయగలను?" అనే కారణం చెప్పిన సల్మాన్ సోనమ్ ని తిరస్కరించాడట.

  మొన్న కరుణ్ జోహార్

  మొన్న కరుణ్ జోహార్

  రీసెంట్ గా ఈ షోకు కరుణ్ జోహార్ వచ్చారు. ఆయన తన సెక్స్ లైఫ్ నుంచి రాఖీ సావంత్...వరకూ మాట్లాడి కాంట్రావర్శి క్రియేట్ చేసాడు. ఇవన్నీ ఫిల్టర్ లేకుండా డైరక్ట్ గా మనసుల్లో మాటలు కాబట్టి వివాదాలు తప్పవు ఈ షో ద్వారా అంటున్నారు.

  మొన్నే రిలీజైంది

  మొన్నే రిలీజైంది

  అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్దన్ కపూర్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సోనమ్ తమ్ముడైన హర్షవర్దన్ వయసు 25. 'మీర్జ్యా' అనే సినిమా ద్వారా హీరోగా తెరంగ్రేటం చేసాడు. తాజాగా ఈ చిత్రం విడుదలై ఫ్లాఫ్ అయ్యింది.

  English summary
  The ‘Neerja’ star Sonam Kapoor, who has landed in controversies in the past owing to her bluntness, opened up about how she hates her brother’s taste in women.Sonam Kapoor Has Very Important Sex Advice For Harshvardhan Kapoor!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X