twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను హాట్ ప్రాపర్టీనే కానీ..అనూష్క

    By Srikanya
    |

    నాకు తెలుసు ఈ రోజు టాలీవుడ్ లో నేనెంత హాట్ ప్రాపర్టీనో..అంత మాత్రాన ఏ సినిమా పడితే అది ఒప్పుకోవటం చేయను. నా దృష్టి అంతా స్క్రిప్టు మీదే. అలాగే ఎంత బిజీగా ఉన్నా నేను నా బెస్ట్ ఇస్తూనే ఉంటాను అంటోంది అనూష్క. అరుంధతి విజయంతో అందరి దృష్టి అనూష్క మీదే ఉంది. పెద్ద పెద్ద సంస్ధలు, హీరోలు అంతా ఆమెనే తమ ప్రాజెక్టులో ఉండాలని కోరుకుంటున్నారు. ఈ విషయం గురించి అనూష్క మాట్లాడుతూ...నేను యాక్టర్ ను కాకపోయింటే మంచి టీచర్ ని అయ్యుండే దాన్ని. నాకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది..ఇన్ని పెద్ద ప్రాజెక్టులు నాదగ్గరకు రావటం. ఇది ఊహించనది. అసలు నా సినీమా ఎంట్రీనే నేనెప్పుడూ అనుకోలేదు. నేను భరత్ ఠాకూర్ వద్ద ఓ యోగా టీచర్ అంతే. అయితే నా కెరీర్ ఇంతలా మలుపు తిరుగుతుందని ఏనాడూ కలలో కూడా ఊహించలేదు.

    రెమ్యునేషన్ గురించి మాట్లాడుతూ...నా కెంత ఇస్తే సరిపోతుందనుకుంటున్నానో అదే చార్జ్ చేస్తున్నాను. నాకు తెలుసు ఆ రెమ్యునేషన్ అంత ఎక్కువ కాదు అని. అయినా ఇక్కడ కష్టపడి రూపాయి సంపాదించుకుందామనే కదా పరిశ్రమకు వస్తారు అంతా అంటూ తెలివిగా సమాధాన మిచ్చింది.ఇక బాలీవుడ్ ఆఫర్స్ గురించి మాట్లాడుతూ..ఇప్పటి వరకూ రాలేద.ఏమో భవిష్యత్ లో వస్తాయేమో. ఎందుకంటే నేను గ్లామర్, డీ గ్లామర్ సబ్జెక్టులు రెండింటికీ పనికొస్తాను కదా అంటూ ముగించింది. ప్రస్తుతం అనూష్క..మహేష్ సరసన త్రివిక్రమ్ చిత్రంలో చేస్తోంది. అలాగే క్రిష్ వేదం చిత్రంలో వేశ్య పాత్ర చేస్తోంది. మరో ప్రక్క రవితేజతో డాన్ శీను చిత్రాన్ని కమిట్ అయ్యింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X