నా డ్రీమ్ రోల్ సైకో కిల్లర్: స్నేహా
పైకి ఎంతో అందంగా... ఐశ్వర్యా రాయ్ లా కనిపించే బాలీవుడ్ తార స్నేహా ఉల్లాల్ మనసులో ఓ భయంకరమైన కోరిక వుందట. అదేమిటంటే, తన నటనతో ప్రేక్షకులని భయపెట్టాలని ఉందంటోంది! మరి, భయపెట్టాలంటే... అలాంటి పాత్ర చేయాలి కదా... దాని గురించే చెబుతూ, 'నాకు సైకో పాత్ర పోషించాలని వుంది. ఇది నా డ్రీం రోల్ కూడా. ఎవరైనా అలాంటి ఆఫర్ ఇస్తే నా తడాఖా చూపిస్తా. అందర్నీ భయపెట్టి వదిలేస్తా" అంటోంది ఈ సోయగాల సుందరి స్నేహా. నాకు చిన్న, పెద్ద ప్రాజెక్టులన్న తారతమ్యం ఏమీ లేదు. ప్రతీదీ వర్కే. నాకు నచ్చితే ఏపాత్ర అయినా చేస్తా.
అన్నట్టు తను నటించిన 'మడతకాజా' సినిమా ఈ 30 న రిలీజ్ అవుతోంది. ఇది తనకు మంచి పేరు తెస్తుందని ఆమె ఆశిస్తోంది. 'తొలిసారిగా కామెడీ సినిమా చేశాను. కామెడీ చేయడం ఎంత కష్టమో ఈ సినిమా చేసాక తెలిసింది. అల్లరి నరేష్ ఫ్రెండ్లీగా ఉంటాడు. అయితే, రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు మాత్రం నెర్వస్ అయిపోతాడు" అంటోంది స్నేహా నవ్వేస్తూ. ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉన్న 'మడతకాజా" చిత్ర విజయం ఫై నాకే డౌట్ లేదు. అందుకే నేను చాలా కూల్ గా ఉన్నా. ఇంత రిలాక్స్డ్ గా ఉండటం నా లైఫ్ లో ఫస్ట్ టైం. సల్మాన్ ఖాన్ తో నేను చేసిన చిత్రం విడుదల రొజూ కొంత నెర్వస్ ఫీలయ్యా. అయితే మడత కాజా విషయంలో ఈ ఇబ్బంది లేదు అంటో స్వీట్ అండ్ స్మార్ట్ స్నేహా ఉల్లాల్....


Click it and Unblock the Notifications











