యాంగ్రీ యంగ్ మెన్ లుక్ కన్నా‘బుజ్జిగాడు’ఇష్టం!
యాంగ్రీ యంగ్ మెన్ లుక్ కన్నా, 'బుజ్జిగాడు" సినిమాలో జోవియల్ గా వుండే కుర్రాడిగా కన్సించడానికే ఎక్కువ ఇష్టపడ్తానంటున్నాడు హీరో ప్రభాస్. ఎన్ని సినిమాలు చేసినా నటుడిగా, 'బుజ్జిగాడు" తనకు ఇచ్చిన సంతృప్తి ముందు మిగతావన్నీ తేలిపోతాయని చెబుతోన్న ప్రభాస్, 'ఛత్రపతి" కమర్షియల్ హీరోగా తన రేంజ్ పెంచిన చిత్రమని చెప్పుకొచ్చాడు ఓ ఇంటర్వ్యూలో.
సరదాగా వున్నఫ్పుడు పశ్చిమగోదావరి జిల్లా యాస అనుకోకుండా అదే మాటల్లో వచ్చేస్తూ వుంటుందనీ, తన డిక్షన్ కి అభిమానులనుంచి బోల్డంత స్పందన లభిస్తోందంటోన్న ప్రభాస్, 'డార్లింగ్" నటుడిగా తనలోని మెచ్యూరిటీని మరింతగా ప్రదర్శించిందని అభిప్రాయపడ్డాడు. కాజల్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ చాలా భావుంటుందని చెబుతోన్న ప్రభాస్, ఆమెతో ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ ఫర్ఫెక్ట్ గా వర్కవుట్ అయ్యిందని చెబుతున్నాడు. 'డార్టింగ్" తో మహిళా ప్రేక్షకుల్లో మరింత ఫాలోయింగ్ తనకు పెరిగిందనీ, ఓ పక్క లవర్ బాయ్ గా కన్సిస్తూనే, ఇంకోపక్క యాక్షన్ సినిమాలూ చేస్తానని అంటున్నాడు డార్లింగ్ ప్రభాస్.


Click it and Unblock the Notifications











