ఆ స్టార్ హీరోయిన్ పై మోజుతీరని స్టార్ హీరో...!?
ఐశ్వర్య రాయ్, సంగీతా బిజిలానీ, సుస్మితాసేన్, కత్రినా కైఫ్..ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరేమిటి, సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం నడిపిన అందాల భామలు బోల్డంతమందే వున్నారు బాలీవుడ్ లో. అయితే తాను అలా ఫ్రెండ్షిప్ చేసినవారందిరిలోనూ కత్రినా కైఫ్ అంటే తనకు చాలా ఇష్టమని అంటోన్న సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ తో కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డాననీ, తీరా అది వర్క్ అవుట్ కాకపోవడం తనను చాలా బాధిస్తోందని చెప్పుకొచ్చాడు చెప్పుకొచ్చాడు ఓ ఇంటర్వ్యూలో.
ఈ విషయమై కత్రినాకైఫ్ అభిప్రాయం ఎలా వున్నా, తనకు మాత్రం కత్రినా పై మోజు ఇంకా తీరలేదని, అది కూడా వేరే ఉద్దేశ్యంతో కాదని సల్మాన్ ఖాన్ కవరింగ్ ఇచ్చుకుంటున్నాడు. కాగా సల్మాన్ ఖాన్ తనకు మంచి మిత్రుడు మాత్రమేననీ, అంతకన్నా వేరే సంబంధమేదీ తమ మధ్య లేదని చెబుతోంది కత్రినాకైఫ్. ఒక వేళ సల్మాన్ ఖాన్ కి తనను పెళ్ళి చేసుకోవాలనే ఉద్దేశ్యం వున్నా, ఆ విషయమై తానేమీ స్పందించబోనని కత్రినా మీడియాకి మొహం చాటేసింది.


Click it and Unblock the Notifications











