»   »  అలాంటి మగాళ్లతో మాట్లాడటం ఇష్టం ఉండదు: అనుష్క

అలాంటి మగాళ్లతో మాట్లాడటం ఇష్టం ఉండదు: అనుష్క

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అనుష్క పెళ్లి గురించి చాలా కాలంగా హాట్ టాపిక్ నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె వయసు 34 సంవత్సరాలు. సినిమాల్లో బిజీగా ఉండటంతో వయసు అయిపోతున్న విషయం గురించిగానీ, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మాత్ర చేయడం లేదు. అయితే మీడియా వారు ఎదురు పడినపుడల్లా ఆమెకు ఎదురవుతున్న ప్రశ్నలు ఎక్కువగా పెళ్లి గురించే.

పెళ్లి విషయంతో పాటు మీరు ఎలాంటి వారిని భర్తగా కోరుకుంటున్నారు, మగాళ్లు ఎలా ఉంటే మీరు ఇష్టపడతారు అనే ప్రశ్నలు కూడా అనుష్కకు ఎదురువుతున్నాయి. ఇటీవల ఓ సందర్భంలో అనుష్కకు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. దీనికి అనుష్క ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది.

I like men with honest, frank eyes: Anushka

నిజాయితీగా ఉండే మగాళ్లంటే ఇష్టం. వారిని చూడగానే వారి కళ్లలో నిజాయితీ కనిపించాలి. సన్ గ్లాసెస్ పెట్టుకున్న మాగాళ్లతో మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. మన కళ్లు మనం ఎలాంటి వ్యక్తులమో ఇట్టే చెప్పేస్తాయి. హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ కళ్లలో నిజాయితీ కనిపిస్తుంది. అలాగే స్వచ్చంగా నవ్వే మగాళ్లంటే ఇష్టం, నేను ఎక్కువగా సింప్లిసిటీని ఇష్టపడతాను. నా ఫ్రెండ్స్, నా చుట్టు ఉండేవారంతా కూడా అలాంటి వారే అని నిర్మొహమాటంగా చెప్పింది అనుష్క.

పెళ్లి గురించి మాట్లాడుతూ...పెళ్లి గురించి ఇంకా ఆలోచించడం లేదు .. సమయం వచ్చినప్పుడు జరుగుతుందని అనుష్క చెప్పింది. తానెప్పుడూ కథానాయికను అవుతానని అనుకోలేదనీ .. కానీ అయ్యానని అంది. ప్రస్తుతం అనుష్క బాహుబలి లాంటి భారీ సినిమాలతో .. భారీ విజయాలతో బిజీ బిజీగా వుంది కనుక, ఇప్పట్లో ఆమె పెళ్లి ఆలోచన చేయకపోవచ్చనే అనుకుంటున్నారు.

English summary
"I like men with honest, frank eyes. And that's the reason I cannot talk anyone who has their sun glasses on. Also, the way a guy smiles... I think your eyes and smile give away a lot about you." Anushka said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu