నాలో నాకు బాగా నచ్చేవి అవే...అనుష్క
"అందరికీ మీరంటే ఇష్టం. మరి మీలో మీకేంటి ఇష్టం...' అని అనుష్కను మీడియా అడిగారు. దానికి ఆమె..."అనుష్క అనగానే గుర్తొచ్చేది నా కళ్లే. నేను నవ్వితే..నా నవ్వులోని భావం నా కళ్లలో కనిపిస్తుందని నా స్నేహితులు అంటుంటారు. నాక్కూడా నా కళ్లంటే ఇష్టం.అలాగే ఆరడుగల హీరోల సరసన చేసేటప్పుడు నా హైట్ నాకు ప్లస్ అవుతుంటుంది అంటూ హీరో గోపీచంద్ ని ఇండైరక్ట్ గా ఆమె తలుచుకుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా నా ఆత్మ విశ్వాసం అంటే నాకిష్టం. వాతావరణం ఎంత ప్రతి కూలంగా ఉన్నా...పరిస్థితులు ఎంత జటిలంగా మారినా..వాటి నుంచి నా ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకొని ఈజీగా బయటపడగలను' అంటూ చెప్పుకొచ్చారు అనుష్క. ప్రస్తుతం ఆమె మహేష్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోంది. అలాగే గమ్యం ఫేమ్ క్రిష్ దర్శకత్వంలో రెడీ అవుతున్న వేదం చిత్రంలో వేశ్యగా కనిపించనుంది.
అనుష్క అరుంధతి త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు క్రిష్ గమ్యం వేదం anushka arundhati trivikram srinivas mahesh babu krish gamyam vedam


Click it and Unblock the Notifications