»   » పవర్ స్టార్, పోర్న్ స్టార్స్ దూరంగా ఉన్నంత వరకే.... వర్మ సెన్సేషన్

పవర్ స్టార్, పోర్న్ స్టార్స్ దూరంగా ఉన్నంత వరకే.... వర్మ సెన్సేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గతంతో పోలిస్తే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వివాదాలకు కాస్త దూరంగా ఉంటున్నాడనే చెప్పొచ్చు. ఆయనలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. అప్పట్లో వర్మ చేసిన వివాదాస్పద ట్విట్టర్ కామెంట్స్ అన్ని వోడ్కా తాగిన మత్తులోనే చేశారనే ఓ ఆరోపణ కూడా ఉంది. ఆ మధ్య ఆయన వోడ్కా మానేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల కాలంలో వర్మ నుండి ఎలాంటి వివాదాలు లేక పోవడంతో.... ఇది నిజమే అని అంతా నమ్ముతున్నారు.

ప్రస్తుతం రాముడు మంచి బాలుడు తరహాలో తన పనేదో తాను చేసుకుంటూ సైలెంటుగా ఉన్న వర్మ...ఇటీవల ఓ ఇంటర్వ్యూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ గురించి, టాలీవుడ్ స్టార్ల గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన గమ్మత్తైన సమాధానాలు ఇచ్చారు.

పవర్ స్టార్, పోర్న్ స్టార్ దూరంగా ఉన్నంత వరకే...

పవర్ స్టార్, పోర్న్ స్టార్ దూరంగా ఉన్నంత వరకే...

ఒక వేళ పవన్ కళ్యాణ్ ఇన్వైట్ చేస్తే జనసేన పార్టీలో చేరుతారా? అన్న ప్రశ్నకు రామ్ గోపాల్ వర్మ సమాధానం ఇస్తూ.... వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. నేను పోర్న్ స్టార్లను ఎంతగా ఇష్టపడతానో అంతకంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్‌ను ఇష్టపడతాను. ఇద్దరూ దూరం నుండి చూస్తున్నంత వరకే బాగా కనిపిస్తారు. వారికి దగ్గరగా వెళ్లి నాలో వారిపై ఉన్న ప్రేమను పోగొట్టుకోవడం ఇష్టం లేదు అని వర్మ సమాధానం ఇచ్చారు.

మెగా ఫ్యామిలీతో గొడవ... తప్పు నాదే

మెగా ఫ్యామిలీతో గొడవ... తప్పు నాదే

ఆ మధ్య మెగా ఫ్యామిలీ మీద రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్స్ చేశారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పి ఇకపై ఎలాంటి కామెంట్స్ చేయను అని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ ప్రశ్న ఎదురవ్వగా..... ఆ విషయంలో తప్పు నా వైపే ఉంది, అందుకే తర్వాత సైలెంట్ అయిపోయాను అని వర్మ తెలిపారు.

బాహుబలి క్రెడిట్ ఎవరికి?

బాహుబలి క్రెడిట్ ఎవరికి?

బాహుబలి ప్రాజెక్ట్ ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే..... క్రెడిట్ రాజమౌళి లేదా ప్రభాస్ ఇద్దరిలో ఎవరికి ఇస్తారు? అనే ప్రశ్నకు వర్మ సమాధానం ఇస్తూ..... ‘ప్రభాస్ లేకుంటే బాహుబలి ప్రాజెక్ట్ సాధ్యం కాకపోవచ్చు. బాహుబలి లాంటి ప్రాజెక్టును తీసేంత ధైర్యం రాజమౌళి తప్ప మరే దర్శకుడు చేయక పోవచ్చు, ఆయనలా కష్టపడటం కూడా సాధ్యం కాక పోవచ్చు అని వ్యాఖ్యానించారు.

అలాంటి సినిమా నా వల్ల కాదు

అలాంటి సినిమా నా వల్ల కాదు

బాహుబలి 2 లాంటి సినిమా తీయడం నా వల్ల కాదు. రాజమౌళికి ఉన్నంత ఓపిక, పాషన్, విజన్ తనకు లేదని తెగేసి చెప్పాడు వర్మ.

బాహుబలి 2 పైరసీ వెర్షన్ చూశాను

బాహుబలి 2 పైరసీ వెర్షన్ చూశాను

బాహుబలి 2 సినిమా మొత్తం చూడలేదు, పార్ట్ పార్ట్‌గా చూశాను. అది కూడా పైరేటెడ్ ప్రింట్ అని వర్మ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మరి సినిమా మొత్తం చూడకుండా ఎలా ప్రశంసిస్తున్నారు? అంటే....... బాహుబలి 2 బావుంది, బాగోలేదు అని చెప్పడానికి నేనెవరిని, ఈ దేశ ప్రజలు, ఇండస్ట్రీకి సినిమా నచ్చింది. వారికి నచ్చింది అంటే సినిమా బావున్నట్లే కదా అని వర్మ అన్నారు.

పోర్న్ చూస్తాను

పోర్న్ చూస్తాను

ప్రతి రోజూ తాను కనీసం గంట పాటు ఇంటర్నెట్ మీద గడుపుతాను. పోర్న్ చూస్తాను. ప్రపంచంలో జరిగే విషయాను తెలుసుకుంటాను అని వర్మ తెలిపారు.

రోజూ ముగ్గురు అమ్మాయిలు కావాలి

రోజూ ముగ్గురు అమ్మాయిలు కావాలి

మీకు ప్రతి రోజూ ఓ కొత్త అమ్మాయి కావాలి అనే వార్త నిజమేనా? అనే ప్రశ్నకు వర్మ స్పందిస్తూ....... ఒకరు కాదు, వాస్తవానికి ముగ్గురు కావాలి అంటూ వర్మ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.

వాళ్లే నా సలహాలు తీసుకుంటారు

వాళ్లే నా సలహాలు తీసుకుంటారు

మీరు ఎప్పుడైనా సైకియాట్రిస్ట్ ను కలిశారా? అనే ప్రశ్నకు వర్మ సమాధానం ఇస్తూ.... వారు తమ పేషెంట్లను డీల్ చేయడానికి నా సలహాలు తీసుకుంటారు అంటూ తెలివిగా సమాధానం ఇచ్చారు వర్మ.

English summary
"I like Pawan Kalyan's personality. In fact, I like him as much as I like Porn Stars. Both look good from distance, I don't want to lose my love for them by going closer to either." RGV said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu