పుకార్లు నమ్మొద్దు, రెండు నెలల్లో అన్నీ: అఖిల్
హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ నుండి త్వరలో వెండి తెరకు పరిచయం కాబోతున్న మరో యువ హీరో....అఖిల్ అక్కినేని. అయితే అఖిల్ తెరంగ్రేటంపై రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో అఖిల్ పలు క్లారిఫికేషన్స్ ఇచ్చారు.
నా సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు తానే చూసుకుంటున్నానని, నాన్న కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారు అని అఖిల్ వెల్లడించారు. అయితే సినిమా విషయంలో కుటుంబ సభ్యుల సూచనలను వింటాను అన్నారు. ఇప్పటి వరకు రెండు కథలు విన్నాను. ఇంకా ఏదీ ఖరారు కాలేదు. ఓ సీనియర్ దర్శకుడితోనే తొలి చిత్రం చేయబోతున్నాను అన్నారు.

తొలి చిత్రం ప్రేమ కథతో రావాలా? లేక యాక్షన్ స్టోరీతో రావాలా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. మరో రెండు నెలల్లో నా సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు వెల్లడిస్తాను అన్నారు. అదే విధంగా మనం సినిమాలో నేను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదు. ఇప్పటి వరకు సినిమా చిత్రీకరణ చూసానే తప్ప....నటించలేదు. నేను ఆ సినిమాలో లేను. ఒక వేళ అవసరం అయితే నటిస్తాను అన్నారు.
జిమ్‌లో కనపడినంత మాత్రాన సిక్స్ ప్యాక్‌తో సినిమల్లోకి వస్తున్నానని ఊహించుకోవద్దు....బాడీ ఫిట్ గా ఉంచుకోవడానికి జిమ్ కి వెళతాం అంతే. నాన్న, అన్నయ్య కూడా రోజూ వర్కౌట్లు చేస్తారు. ఆ మధ్య నేను, అన్నయ్య జిమ్ లో ఉండగా మాకు తెలియకుండా ఫోటో తీసి నెట్లో పెట్టారు. అప్పటి నుండి ఆ జిమ్‌కు వెళ్లడం లేదు, ఇంట్లోనే వర్కౌట్లు చేస్తున్నా అన్నారు అఖిల్. సిసిఎల్ తెలుగు వారియర్స్ వైస్ కెప్టెన్‌గా అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని అఖిల్ తెలిపారు.


Click it and Unblock the Notifications











