For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వ్యాఖ్య : దర్శకుడు పూరీ జగన్నాథ్ చెంప ఛెళ్లుమనిపించాలి

  By Srikanya
  |

  హైదరాబాద్‌ : ప్రముఖ సినీదర్శకుడు పూరీజగన్నాథ్‌పై ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్‌ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజాన్ని ఉద్దరించాలనే ఆలోచనతో సినిమాలు తీస్తే సంకనాకిపోతాయని పూరీ జగన్నాథ్ అన్నారని, ఆయన చెంప చెళ్లుమనిపించాలని దేశపతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెదక్ లో జరిగిన ఓ సెమినార్ లో ఆయన మాట్లాడారు.ఆ వీడియో మీరూ చూడండి.

  దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ... స్త్రీ ల పట్ల చాలా అవమానకరమైన థోరణిని సినిమా ప్రదర్శిందోనని అన్నారు. ఓ హీరోయిన్ ని ఇసుకలో పడేసి..మృగాన్ని ఈడ్చుకుపోయినట్లు హీరో ఈడ్చుకుపోతాడు. అది పోస్టర్లలో హైదరాబాద్ లో వేస్తారు. మహిళలను అవమానించే సంస్కృతిని సీమాంధ్ర దర్శకులు ముందుకు తెస్తున్నారని దేశపతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  అలాగే... ‘‘ సమాజాన్ని ఉద్ధరించాలనే ఆలోచనలో సినిమాలు తీస్తే చంక నాకిపోతాయని మాట్లాడిన పూరిజగన్‌ తనముందుకొస్తే చెంప పగులకొడతానని, ఉపాధ్యాయులను, మహిళలను అవమానపరస్తూ బలాదూర్‌ కల్చర్‌ను సీమాంధ్ర దర్శకులు ముందుకు తెస్తున్నారని'' పూరిజగన్‌పై తీవ్రంగా ఆగ్రహాం వ్యక్తపరిచారు. ఇంతకీ ఈ ఆగ్రహాం ఏ సందర్భంగా వ్యక్తపరిచారో తెలిస్తే ఆశ్చర్యపోకమానదు.

  దేశపతి శ్రీనివాస్‌ ఈరోజు మెదక్‌ జిల్లా సంగారెడ్డిలోని తారా డిగ్రీ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన ‘‘తెలంగాణ పునర్నిరాణం-అభివృద్ది'' అనే అంశంపై మాట్లాడిన దేశపతి ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి, పూరిజగన్నాథ్‌ సినిమాకి లింక్‌ ఏమిటో అర్ధంకాక విద్యార్ధులే తలపట్టుకున్నారు. దీనిపై పూరిజగన్‌ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి.

  ప్రస్తుతం పూరి జగన్నాథ్ ..టెంపర్ చిత్రం బిజీలో ఉన్నారు.‘టెంపర్‌'విశేషాలకు వస్తే...

  శివబాబు బండ్ల సమర్పిస్తున్న సినిమా ‘టెంపర్‌'. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేశ్‌ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ఈ మధ్యనే విడుదల అయ్యి మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కొత్త వర్కింగ్ స్టిల్ ని పూరి విడుదల చేసారు. ఈ స్టిల్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏటిట్యూడ్ కనపడుతోంది. ఖచ్చితంగా పెద్ద హిట్ కొట్టబోతున్నారని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

  I'll Slap Director Puri Jagannadh

  ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇన్సపెక్టర్ దయ గా కనిపించనున్నారని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా రగ్గడ్ గా ఉండబోతోందని, చాలా సార్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పాత్ర ఇదని చెప్తున్నారు. సర్కిల్ ఇన్సపెక్టర్ గా ఎన్టీఆర్ చెలరేగిపోతున్నాడని వినికిడి. నాగార్జున శివ మణి లో చేసిన పాత్ర తరహాలో పూర్తి మాస్ టచ్ లో ఈ పాత్ర సాగుతుందని చెప్తున్నారు.

  అలాగే ఈ చిత్రం ఆడియో జనవరి 10న విడుదల అయ్యే అవకాసం ఉంది. థియోటర్ ట్రైలర్ ఫిబ్రవరి 5 న విడుదల చేసి మార్చి చివరకు సినిమాని విడుదల చేస్తారు. ఎన్టీఆర్‌ సినిమా అంటే మాస్‌ ప్రేక్షకులకు పండగే. పోరాట ఘట్టాలూ, నృత్యాలూ, పదునైన సంభాషణలతో విందు భోజనం వడ్డించేస్తారు. ఇలాంటి కథల్ని తెరపై ఆవిష్కరించడంలో దిట్ట పూరి జగన్నాథ్‌. వీరిద్దరి కలయికలో ఈ చిత్రం రూపుదిద్దుకుండూంటంతో మంచి క్రేజ్ వస్తోంది.

  కాజల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు.

  ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

  English summary
  Telangana Chief Minister KCR's OSD (Officer on Special Duty)-lyricist-singer Desapati Srinivas made sensational comments against ace director Puri Jagannadh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X