'అదే రోజు నా సినిమా రిలీజే కానీ బాహుబలి చూస్తాను '
ముంబై: తన సినిమా అదే రోజు విడుదలైనా సరే..రాజమౌళి చిత్రం బాహుబలిని చూస్తాను అంటున్నారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కస్యప్. బాహుబలి చిత్రం మే 15, 2015 న విడుదల అవుతోంది. అదే రోజు ...అనురాగ్ కస్యప్ తాజా చిత్రం 'బాంబే వెల్వెట్' రిలీజ్ అవుతోంది. ఈ నేపధ్యంలో ఆయన ఇలా కామెంట్ చేసారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
అనురాగ్ మాట్లాడుతూ... "నేను నా సినిమాని ఇప్పటికే చూసేసాను. కాబట్టి అదే రోజు రిలీజ్ అవుతున్న బాహుబలిని చూస్తాను. నేను ఆయనకు హార్డ్ కోర్ ఫ్యాన్ ని.. ఆయన సినిమా మొదటి రోజు మొదటి షో చూస్తాను " అన్నారు. అదీ రాజమౌళికి దేశవాప్తంగా ఉన్న క్రేజ్.

'బాంబే వెల్వెట్' విషయానికి వస్తే...
ఒక సినిమాలో ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్ ఉంటే అది ముక్కోణపు ప్రేమ కథ. హీరో హీరోయిన్ల మధ్య విలన్ చేరి హీరోయిన్ ను ప్రేమిస్తే అది ప్రేమ-మోహం మధ్య యుద్ధమవుతుంది. ఇలాంటి నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం 'బాంబే వెల్వెట్'.
1960-70ల కాలంనాటి కథతో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో జానీ బాలరాజ్‌గా రణ్‌బీర్ కపూర్ కనిపిస్తే.. జాజ్ సింగర్ రోజీగా అనుష్క నటిస్తోంది. ఇద్దరి మధ్య విలన్ కైజాద్ ఖంబట్టాగా కరణ్ జోహార్ చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
సినిమా నేపథ్యాన్ని వివరిస్తూ, ప్రధాన పాత్రల స్వభావాలను తెలిపేలా ప్రచార చిత్రాన్ని రూపొందించారు. సినిమాలో రణ్‌బీర్, అనుష్కల మధ్య ఘాటైన అధర చుంబన దృశ్యాలున్నాయని చిత్రబృందం ఎప్పటి నుంచో చెబుతోంది. దాన్ని రుజువు చేసేలా ఈ ప్రచార చిత్రంలో రణ్‌బీర్, అనుష్కల ముద్దు సన్నివేశాలు కుర్రకారును వేడెక్కిస్తున్నాయి. మే 15న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











