చైతన్య నాకు బాయ్ ఫ్రెండ్ కంటే భర్తగానే ఇష్టం: సమంత

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత వివాహం తర్వాత క‌లిసి న‌టిస్తున్న చిత్రం 'మ‌జిలీ'. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ పై సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సినిమా ప్రమోషనల్ ఈవెంటులో నాగ చైతన్య మాట్లాడుతూ... 'మజిలీ' సినిమా సమంత, నేను కలిసి నటించడం ప్లాన్డ్‌గా చేసింది కాదని, అనుకోకుండా మా కాంబినేషన్ సెట్టయిందని తెలిపారు. పెళ్లి తర్వాత మేము ఇద్దరం చేసే స్క్రిప్టు కోసం ప్రయత్నించలేదు... 'మజిలీ' స్క్రిప్టు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది' అని తెలిపారు.

చై బాయ్‌ఫ్రెండ్‌గా కంటే భర్తగానే ఇష్టం

చై బాయ్‌ఫ్రెండ్‌గా కంటే భర్తగానే ఇష్టం

‘‘మజిలీ చిత్రానికి... మా రియల్ లైఫ్‌కు ఎలాంటి సంబంధం లేదు. నాకు చై బాయ్ ఫ్రెండుగా కంటే... భర్తగానే ఎక్కువ ఇష్టం. మజిలీలో పూర్ణ మాదిరిగా చై ఉండరు. ‘ఏమాయ చేశావె, మనం' సినిమాలు చేసిన తర్వాత మళ్లీ లవ్ స్టోరీ చేస్తే బావుండదు అనుకున్నాం. సేమ్ లవ్ స్టోరీ చేయడం నటులుగా కూడా మాకు సంతృప్తి ఉండదు.'' అని సమంత తెలిపారు.

సమంత నన్ను బ్యాలెన్స్ చేస్తుంది

సమంత నన్ను బ్యాలెన్స్ చేస్తుంది

ప్రతి రిలేషన్ షిప్‌లో లవ్, పెయిన్ రెండూ ఉంటాయి. పెయిన్ తర్వాత ప్రేమగా మారితే ఆ రిలేషన్ షిప్ మరింత బలంగా ఉంటుందని మా నమ్మకం. సామ్ అన్ని విషయాల్లో నన్ను బ్యాలెన్స్ చేస్తుందని నాగ చైతన్య చెప్పుకొచ్చారు.

నా జీవితంలో తీసుకున్న ఉత్తమ నిర్ణయం

నా జీవితంలో తీసుకున్న ఉత్తమ నిర్ణయం

చైతన్యను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం నా జీవితంలో తీసుకున్న బెస్ట్ డెసిషేన్ అని సమంత తెలిపారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత మా జీవితం ఎంతో సంతోషం ఉందని నాగ చైతన్య తెలిపారు. ఏ రిలేషన్ షిప్‌లో అప్స్ అండ్ డౌన్స్ సహజమే అని తెలిపారు.

క్రికెట్ గురించి తెలియదు, అఖిల్ హెల్ప్ చేశాడు

క్రికెట్ గురించి తెలియదు, అఖిల్ హెల్ప్ చేశాడు

మజిలీలో నా పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. ఒకటి 22 ఇయర్స్ కుర్రాడిలా, క్రికెటర్‌గా కనిపిస్తాను. నాకు స్పోర్డ్స్ అంటే ఇష్టం కానీ క్రికెట్ మీద నాలెడ్జ్ లేదు. షూటింగ్ ముందు క్రికెట్ ప్రాక్టీస్ చేశాను. ఈ విషయంలో నాకు అఖిల్ హెల్ప్ చేశాడు. క్రికెటర్ ఫిజికల్ అప్పియరెన్స్ ఎలా ఉంటుందనే విషయాలు నేర్చుకున్నాను అని నాగ చైతన్య వెల్లడించారు.

మజిలీ

మజిలీ

దేర్ ఈజ్ ల‌వ్.. దేర్ ఈజ్ పెయిన్ అనే ట్యాగ్ లైన్‌తో వ‌స్తున్న ఈ మూవీ వైజాగ్ నేప‌థ్యంలో సాగుతుంది. ఇందులో చైతూ క్రికెటర్‌గా కనిపించబోతున్నారు. రావు ర‌మేష్, పోసాని కృష్ణ‌ముర‌ళి, సుబ్బ‌రాజ్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాన‌, సంగీతం: గోపీ సుంద‌ర్, సినిమాటోగ్ర‌ఫీ: విష్ణు శ‌ర్మ, ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్, ఎడిట‌ర్: ప‌్ర‌వీణ్ పూడి, యాక్ష‌న్: వెంక‌ట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X