twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంత కంటే చైతూ అంటే నాకు లవ్వు.. అలాగని నేను ‘గే’ కాదు.. తప్పతాగి వర్మ ట్వీట్... చైతూ ఏమన్నాడంటే

    |

    Recommended Video

    RGV Confesses His Love Towards Naga Chaitanya | Majili | Samantha Akkineni | Naga Chaitanya

    వోడ్కా ప్రియుడు, దర్శకుడు రాంగోపాల్ వర్మ డోస్ పెరిగిందంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తుంటాడు. కొన్నిసార్లు అవి ఆసక్తికరంగా ఉంటాయి. మరొకొన్ని సార్లు ట్వీట్లు వివాదంగా మారుతాయి. తాజాగా అలాంటి ట్వీట్ ఒకటి చేసి వెంటనే డిలీట్ చేశారు. అది నాగచైతన్య, సమంతను ఉద్దేశించి వర్మ ట్వీట్ చేయడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. రాంగోపాల్ వర్మ ఏమని ట్వీట్ చేశారంటే..

     నాలుగో పెగ్గు తర్వాత కాబట్టి

    నాలుగో పెగ్గు తర్వాత కాబట్టి

    నేను ఇప్పుడు నాలుగో పెగ్గు వోడ్కా సేవించాను. కాబట్టి నిజం చెప్పదలుచుకొన్నాను. వోడ్కా తాగనప్పుడు చెత్తగా ట్వీట్లు చేస్తాను. ఇప్పుడు డోస్‌లో ఉన్నా కాబట్టి స్టడీగా నిజాలు చెబుతాను. మజిలీ ట్రైలర్‌ను ట్వీట్ చేసి గమ్మత్తయిన కామెంట్లు వర్మ చేశారు.

    నేను గే అని అనుకోవద్దు

    నేను గే అని అనుకోవద్దు

    మజిలీ టీజర్ చేశాను. ఈ టీజర్‌లో సమంత కంటే నేను నాగచైతన్యను బాగా లవ్ చేస్తాను. అలాగని నేను గే అనుకోవద్దు. నిజంగా చెబుతున్నాను ఆమె కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటూ నాగచైతన్యకు ట్విట్టర్ ద్వారా తన లవ్‌ను వెల్లడించారు.

    వైరల్‌గా ఆర్జీవీ ట్వీట్

    వైరల్‌గా ఆర్జీవీ ట్వీట్

    రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. అయితే ఏం జరిగిందో గానీ వెంటనే డిలీట్ చేశాడు. అయితే వర్మ చేసిన ట్వీట్‌కు నాగచైతన్య బదులిచ్చాడు. ఏ పరిస్థితుల్లో నీవు ట్వీట్ చేశావో నేను పెద్దగా పట్టించుకోను. కానీ ఎంజాయ్ చీర్స్ అంటూ చైతూ ట్వీట్ ద్వారా బదులిచ్చాడు.

    ఏప్రిల్ 5న మజిలీ రిలీజ్

    ఏప్రిల్ 5న మజిలీ రిలీజ్

    నాగచైతన్య, సమంత కలిసి నటించిన మజిలీ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో క్రికెటర్ పూర్ణగా నాగచైతన్య ఓ విషాదకరమైన, ఎమోషనల్ పాయింట్ ఉండే పాత్రను పోషించారు. ట్రైలర్లు, టీజర్లలో కొన్ని సన్నివేశాలకు మంచి స్పందన వస్తున్నది.

     పెళ్లి తర్వాత తొలిసారి సమంత, చైతూ

    పెళ్లి తర్వాత తొలిసారి సమంత, చైతూ

    పెళ్లి తర్వాత నాగచైతన్, సమంత కలిసి నటిస్తున్న తొలి చిత్రం మజిలి. ఈ చిత్రానికి నిన్నుకోరి దర్శకుడు శివ నిర్వాణ డైరెక్టర్. ట్రాయంగిల్ లవ్ స్టోరిగా రూపొందే ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమా వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరుగగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను ఉద్దేశించి వర్మ ట్వీట్ చేయడం గమనార్హం.

    English summary
    Naga Chaitanya Akkineni, Samantha Akkineni's latest movie is Majili. Ninnu Kori fame Shiva Nirvana is director. This movie pre release functions was held in Hyderabad on March 31st. In this occassion, director varma took to Twitter and wrote, "Yes chay_akkineni I admit am on 4th vodka when I tweeted earlier but will be worse when am not on vodka.. Bottom line I love u more than Samanthaprabhu2 in this trailer and I am not GAY. This is my truth inspite of me loving her more than you (sic)"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X