గౌరీ శరీరాన్ని ప్రేమించాను, ఆమె కోసం సినిమాలు సైతం వదిలేస్తా: షారుక్ ఖాన్

బాలీవుడ్ ఆదర్శ దంపతుల్లో షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ ఒకరు. పాతికేళ్లుగా వీరు దాంపత్య జీవితం కొనసాగిస్తున్నారు.

By Bojja Kumar

Recommended Video

"I love Gauri's body" Shahrukh Khan Says గౌరీ శరీరాన్ని ప్రేమించాను..

షారుక్ ఖాన్, గౌరీ వివాహం 1991లో జరిగింది. పాతికేళ్లకు పైగా ఈ జంట కలిసి జీవిస్తున్నారు. బాలీవుడ్లో సాధారణంగా దంపతులు ఇన్నేళ్లు కలిసుండటం చాలా అరుదు. కానీ షారుక్-గౌరీ ఖాన్ విషయంలో ఇన్ని సంవత్సరాలు ఎలాంటి మనస్పర్థలు లేకుండా అన్యోన్య దాంపత్యం కొనసాగిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

'కింగ్ ఆఫ్ బాలీవుడ్: షారుక్ ఖాన్ అండ్ ది సెడెక్టివ్ వరల్డ్ ఆఫ్ ఇండియన్ సినిమా' పేరుతో అనుపమ చోప్రా రాసిన పుస్తకంలో చాలా ఆసక్తికర విషయాలు పొందుపరిచారు.

గౌరీ శరీరాన్ని ప్రేమించాను

గౌరీ శరీరాన్ని ప్రేమించాను

తాను గౌరీ శరీరాన్ని ప్రేమించానని, ఆమె కోసం తన కెరీర్‌తో పాటు దేన్నయినా వదులుకోవడానికి తాను సిద్ధమని, తన వద్ద ఉన్న ఒకే ఒక ఆస్తి గౌరీ ఖాన్, ఆమెతో కలిసి ఉండటం అంటే తనకు ఎంతో ఇష్టం అని షారుక్ ఖాన్ చెప్పిన విషయాన్ని అనుపమ చోప్రా త పుస్తకంలో రాశారు. తన భార్య అంటే షారుక్‌కు ఎంతో ప్రేమో ఇంతకు మించిన ఉదాహరణ అవసరం లేదు.

ఆ వయసులోనే ప్రేమలో

ఆ వయసులోనే ప్రేమలో

షారుక్ 19 ఏళ్ల వయసులో గౌరీతో తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. అప్పుడు ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలే. మొత్తానికి ఆమెను ఇంప్రెస్ చేసి ప్రేమలో పడేశాడు. ఐదేళ్ల పాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే హిందూ బ్రాహ్మణ, శాఖాహార కుటుంబానికి చెందిన గౌరీ మాత్రం తమ ప్రేమ విషయాన్ని తన తండ్రితో చెప్పడానికి ధైర్యం చేయలేదు.

 చాలాపెద్ద లవ్ స్టోరీ

చాలాపెద్ద లవ్ స్టోరీ

గౌరీ తండ్రిని ఒప్పించడానికి రంగంలోకి దిగిన షారుక్ వారి ఇంట్లో జరిగిన ఓ వేడుకకు హాజరై తనను తాను హిందువుగా పరిచయం చేసుకున్నాడట. ప్రేమించుకునే సమయంలో వీరి మధ్య చిన్నచిన్న గొడవలు కూడా వచ్చాయి. ఓ సారి గౌరీ అతని నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. తన ఫ్రెండ్స్‌తో ముంబై వెళ్లి పోయింది. ఈ విషయం తెలిసిన షారుక్...తన తల్లికి ప్రేమ గురించి వివరించి ఆమె వద్ద డబ్బు తీసుకుని ముంబై వెళ్లి అన్ని బీచ్‌లూ వెతికాడట. చివరకు అక్షా బీచ్‌లో గౌరీని కలిశాడు. ఆ సమయంలో ఇద్దరూ చాలా ఎమోషన్‌కు గురయ్యారు. ఈ సంఘటనతో షారుక్ తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో గౌరీ అర్థం చేసుకుంది. వారి ప్రేమ మరింత బలపడింది. చివరి వరకు కలిసి జీవించాలని అప్పుడే నిర్ణయించుకున్నారు ఈ జంట.

 గౌరీ నా బలం అంటున్న షారుక్

గౌరీ నా బలం అంటున్న షారుక్

షారుక్ కూడా చాలా సందర్బాల్లో, పలు ఇంటర్వ్యూల్లో తన సక్సెస్‌ వెనక భార్య గౌరీ ఉందని, తన బలం ఆమే అని, తనకు సంబంధించిన ప్రతి విషయానికి గౌరీ పిల్లర్ లాంటిదని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X