పొట్టి హీరోగారికి పొడవైన హీరోయిన్లంటేనే ఇష్టమట!
ముంబై: సినిమాల్లో హీరో కంటే హీరోయిన్ పొడవుగా ఉంటే రకరకాల కామెంట్స్ ప్రేక్షకుల నుంచి వినిస్తుంటాయి. అయితే ఇలాంటివేమీ పట్టించుకోకుండా సినిమాలు చేస్తుంటారు కొందరు స్టార్ హీరోలు. మన తెలుగులో కూడా ఓ సీనియర్ స్టార్ హీరో తనకంటే పొడవైన హీరోయిన్లతో ఎన్నో సినిమాలు చేసారు. బాలీవుడ్లోనూ ఇలాంటి హీరోలు ఉన్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం తాను నటిస్తున్న 'ధూమ్-3' చిత్రంలో తనకంటే పొడవుగా ఉండే హీరోయిన్ కత్రినా కైఫ్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. 'ధూమ్-3' చిత్రానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ ఖాన్ ఈ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నాకంటే పొడవుగా ఉండే మహిళలను నేను లవ్ చేస్తాను, ఆమె హీల్స్ వేసుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అంటూ కత్రినాను ఉద్దేశించి అమీర్ ఖాన్ వ్యాఖ్యానించాడు.
ధూమ్, ధూమ్-2 చిత్రాలు భారీ విజయం సాధించి నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'ధూమ్-3' చిత్రంపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. పైగా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఈచిత్రంలో నటిస్తుండటం కూడా మరో కారణం. . ఈచిత్రం క్రిస్‌మస్ సీజన్‌ను పురస్కరించుకుని డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
భారీ యాక్షన్ సన్నివేశాలు, కళ్లు చెదిరే సాహసాలు ఈచిత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. ధూమ్ చిత్రం మొదటి భాగంలో జాన్ అబ్రహం నటించగా....దానికి సీక్వెల్ గా వచ్చి ధూమ్-2 చిత్రంలో హృతి రోషన్ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ 'ధూమ్-3' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈచిత్రంలో కత్రినా కైఫ్ విలన్ పాత్రలో నటిస్తోంది. దీనిపై అమీర్ ఖాన్ స్పందిస్తూ....కత్రినా కైఫ్ విలన్ పాత్ర పోషించడం నా కెరీర్లో మరిచిపోలేని విషయమని చెప్పుకొచ్చారు. సినిమాలో కత్రినా చేసే సాహసాలు ఆకట్టుకునే విధంగా ఉండనున్నాయి. ధూమ్ 2లో జైదీక్షిత్, అలీ ఖాన్ పాత్రల్లో నటించిన ఉదయ్ చోప్రా, అభిషేక్ బచ్చన్...ధూమ్-3 చిత్రంలో కూడా దాదాపు అలాంటి పాత్రల్లోనే పోలీసు ఆఫీసర్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. వీరి పాత్రలు కూడా సినిమాలో ఎంతో కీలకం. చికాగో నేపథ్యంలో సినిమా స్టోరీ ఉంటుంది. అమీర్ ఖాన్ ఇందులో ఓ నేరస్తుడి పాత్రలో కనిపిస్తాడు. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈచిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications












