ముంబయి కోసం ఏమి చేయడానికైన తాను సిద్దమే నంటున్న త్రిష
ఎక్కడి పాట అక్కడే పాడుకోవడం త్రిష కు ఎవరు నేర్పారో గానీ ఆ పాఠం తప్పకుండా పాటించేస్తుంది. నిన్నా మెన్నటి వరకూ 'మీ అభిమాన నటులు ఎవురు? 'అంటే రజనీ .. కమల్ అని చేప్పేది. కట్టా మీఠా తో బాలీవుడ్ తలుపు తట్టాక త్రిష పద్దతే మారిపోయింది. ముంబాయి చాలా గోప్ప నగరమని అక్కడ వాళ్ల మనసు గెలుచు కోవడం కోసం మేరా ముంబాయి మహన్(నా ముంబాయి గోప్పది )అనే స్తాయిలో కబుర్లు చెప్తోంది ఈ చెన్నై చిన్నది. 'షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ల సినిమాలు అంటే బాగా ఇష్టం. వాళ్ల సినిమాలు ఒక్కటి కూడా వదలకుండా చూస్తానని అలాగే కుర్ర హిరోల్లో రణభీర్ కపూర్, ఇమ్రాన్ ఖాన్ బాగా చేస్తున్నారు అని తెగ పోగిడేస్తుంది. పెద్ద హీరోలతో అవకాశాలు వస్తే నా ప్రాధాన్యత మార్చుకోవడానికి సిద్దమే అని చెబుతోంది. ఇక్కడ ప్రాధాన్యత అంటే గ్లామర్, పారితోషకాల్లాంటివన్నమాట. అవకాశం వస్తే గ్లామర్ పాత్రలను చేయడానికి తాను సిద్దమేనని అదోరకంగా చెబుతోంది...


Click it and Unblock the Notifications











