»   »  చైతూతో ఆల్రెడీ పెళ్లయింది, చాలా వరస్ట్, చెర్రీ కిల్లింగ్ ఇట్: సమంత ట్వీట్ చాట్

చైతూతో ఆల్రెడీ పెళ్లయింది, చాలా వరస్ట్, చెర్రీ కిల్లింగ్ ఇట్: సమంత ట్వీట్ చాట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత‌కు అభిమానుల సంఖ్య ఎక్కువే. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే అందుకు నిదర్శనం. తనపై ఫ్యాన్స్ ఎంత అభిమానం చూపిస్తారో... వారిపై కూడా సామ్ అదే స్థాయిలో అభిమానం ప్రదర్శిస్తుంటుంది.

తాజాగా సమంత ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 4 మిలియన్ రీచ్ అయింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌తో ట్విట్టర్ చిట్‌చాట్ చేసింది ఈ చిన్నై చిన్నది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వారి డౌట్స్ క్లియర్ చేసింది.

ఆల్రెడీ పెళ్లయింది

ఆల్రెడీ పెళ్లయింది

నాగ చైతన్యతో పెళ్లిపై ఎలా ఫీలవుతున్నారు అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నపై సమంత స్పందిస్తూ... నా మైండ్‌లో చైతన్యతో ఆల్రెడీ పెళ్లి జరిగి పోయింది. మేము ఇద్దరం తప్ప మిగతావారంతా ఈ విషయంలో ఎక్కువగా ఎగ్టైట్ అవుతున్నారని సమంత అభిప్రాయ పడ్డారు.

రామ్ చరణ్‌తో సినిమా చేయడంపై

రామ్ చరణ్‌తో సినిమా చేయడంపై

రామ్ చరణ్‌తో కలిసి రంగస్థలం సినిమా చేయడంపై సమంత స్పందిస్తూ.... డిఫికల్ట్ వర్కింగ్ కండీషన్స్‌లో కూడా హి ఈజ్ రియల్లీ కిల్లింగ్ ఇట్. అతని పాత్ర తెరపై మరింత ఆసక్తికరంగా ఉంటుందని అని సమంత తెలిపారు.

చిన్న పాత్రే కానీ...

చిన్న పాత్రే కానీ...

రాజుగారి గది-2 చిత్రంలో చేయడంపై స్పందిస్తూ.... అందులో నేను చేసేది చిన్న పాత్రే అయినా చాలా ఇంపాక్టబుల్‌గా ఉంటుందని సమంత తెలిపారు.

మహేష్ బాబు గురించి...

మహేష్ బాబు గురించి...

మహేష్ బాబు గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.... మహేష్ బాబుతో ఉంటే అసలు టైమే తెలియదు. మోస్ట్ ఎంటర్టెనింగ్ కంపెనీ అని సమంత చెప్పుకొచ్చారు.

పెళ్లి తర్వాత చైతూతో చేస్తా

పెళ్లి తర్వాత చైతూతో చేస్తా

పెళ్లి తర్వాత చైతన్యతో కలిసి సినిమాలు చేస్తారా? అనే ప్రశ్నకు సమంత స్పందిస్తూ ఇస్తూ ‘ఎస్' అని సమాధానం ఇచ్చారు.

చాలా వరస్ట్, అలాంటివి చేయను

చాలా వరస్ట్, అలాంటివి చేయను

మీరు చైతన్య ఫోన్ చెక్ చేస్తారా? అనే ప్రశ్నకు సమంత సమాధానం ఇస్తూ.... అలా చేయడం చాలా వరస్ట్ హాబిట్. నేనైతే ఎప్పుడూ అలా చేయను. ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్న మీకు ఓ దండం అంటూ సమంత రిప్లై ఇచ్చారు.

ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారా?

ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారా?

ఓ అభిమాని మీకు ఇష్టమైన జబ్బు ఏమిటి అంటూ.... ప్రశ్నించారు. దీనికి సమంత స్పందిస్తూ ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారా? అంటూ విస్మయం వ్యక్తం చేసింది.

ఇండస్ట్రీలో ఫ్రెండ్స్

ఇండస్ట్రీలో ఫ్రెండ్స్

రకుల్, రెజీనా, లావణ్య, రాశి ఇలా అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటామని... సమంత ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

4 మిలియన్ థాంక్స్

తన ట్విట్టర్ ఫాలోవర్స్ 4 మిలియన్ చేరిన సందర్భంగా సమంత తనను ఇంతగా అభిమానిస్తున్న ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పింది.

English summary
Samantha took some interesting questions about her profession and personal life. One of the her twitter followers asked to share her thoughts on how she was feeling about her wedding, which is just around the corner. “In my head I am married to him already,so I think everyone else is more excited than the both of us,” she said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu