ఎలా వంగడానికైనా సిద్ధమంటున్న అసిన్
నటన విషయంలో ఎటు వైపు వంగడానికైనా తాను సిద్ధమంటోంది హీరోయిన్ అసిన్. భారతీయ సంప్రదాయం ఉట్టి పడే పాత్రలైనా...వెస్టర్న్ లుక్ లో స్టయిలిస్ గా కనిపించే రోల్ అయినా తాను పర్ ఫెక్టుగా చేస్తానని అంటోంది ఈ కేరళకుట్టి. సౌత్ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుని బాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదిగేందుకు ఆసిన్ ఇప్పడు చాలా కష్ట పడుతోంది. సల్మాన్ లాంటి భాలీవుడ్ టాప్ హీరోయిల భజన చేస్తూ....అడపా దడపా అవకాశాలు దక్కించుకుంటున్న అసిన్, ఎవరి ప్రమేయం లేకుండా తన టాలెంట్ మాత్రమే ఉపయోగించి అవకాశాలు దక్కించుకునేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తోందట. ఇటీవలే సల్మాన్ రెడీ సినిమాలో నటించిన అసిన్ ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన్ 'హౌస్ ఫుల్ 2"లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











