నిజం ఒప్పుకున్న కంగనా, రహస్య వ్యక్తితో...
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తెరచాటు ప్రేమ వ్యవహారం మళ్లీ మీడియాలో చర్చనీయాంశమైంది. కంగనా తన రహస్య బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తోందని...అతను యూకె డాక్టర్ నికోలస్ లెఫెర్టీ అని గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే కంగనాా మాత్రం ఈవిషయాన్ని అధికారికంగా వెల్లడించడం లేదు. తన క్లోజ్ ఫ్రెండ్స్ వద్ద కూడా ఈ విషయంలో గోప్యంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె వద్ద బాయ్ ఫ్రెండ్ ప్రస్తావన తీశారు కొందరు జర్నలిస్టులు.
ఈ ప్రశ్నపై కంగనా తనదైన రీతిలో స్పందించింది. అవును, నేను ఒక వ్యక్తితో డేటింగ్ చేస్తున్నారు. కానీ అతను ఎవరికీ తెలియని అదృశ్య వ్యక్తి. అతనెవరో నేను ఇప్పడే బయటకి చెప్పను అంటోంది. మీరు అతన్ని పెళ్లి చేసుకుని పిల్లలను కనే ప్లాన్‌లో ఉన్నారా? అని జర్నలిస్టులు మరో ప్రశ్న సంధించగా....(నవ్వుతూ) నా వయసు ఇంకా 24 సంవత్సరాలు మాత్రమే. అప్పుడే తొందరపడటం నాకు ఇష్టం లేదు అంటోంది.
కంగనా ప్రస్తుతం హృతిక్ రోషన్ సరసన క్రిష్-2, ప్రియదర్శన్ దర్శకత్వంలో తేజ్, తను వెడ్స్ మను చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











