హాట్‌లేడీ అందాలకు పిచ్చెక్కిపోతున్న రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మకు హీరోయిన్ల పిచ్చి ఉంది..అంటే ఏమైనా ఫీలవుతాడా? అస్సలు పీల్ కాడు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ మనసులో ఒకటి పెట్టుకుని, పైకి ఒకటి మాట్లాడే మనిషి కానే కాదు. నిర్మొహమాటంగా తనకు హీరోయిన్లు అంటే పిచ్చి, హీరోయిన్ల అందాలు చూసి ఎంజాయ్ చేస్తా అంటూ నర్మగర్భంగా చెప్పేయగల ఘనుడు. వెటరన్ హీరోయిన్ శ్రీదేవి అందానికి ఫ్లాట్ అయిపోయి ఆమెను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను అంటూ వర్మ గతంలో ప్రకటించి సంచలనం సృష్టించాడు కూడా. వర్మ స్వభావంలో తిక్కలోడే కానీ, ఆయన నోటి నుంచి వచ్చే వచ్చేవి అన్ని దాదాపుగా నగ్న సత్యాలే ఉంటాయి. కొన్ని నగ్న సత్యాలు సాధారణ జనాలకు అప్పుడప్పుడు చేదుగా అనిపిస్తుంటాయి కూడా...
తాజా వివరల్లోకి వెళితే మరో హాట్ లేడీపై రామ్ గోపాల్ వర్మ కన్ను పడింది. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్‌లో 'డిపార్ట్ మెంట్' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నటాలియా కౌర్ అనే బ్రెజిలియన్ హాటీ ఐటం సాంగు చేస్తోంది. డిపార్ట్ మెంట్ చిత్రం ద్వారా తొలి సారిగా ఇండియాన్ సినిమా స్క్రీన్‌పై అడుగు పెట్టబోతోంది ఈ భామ.
ఈ భామ అందాలు చూసి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిచ్చెక్కి పోతున్నాడు. ఇంత వరకు ఆమె లాంటి సెక్సీ ఫిగర్‌ను నా జీవితంలో చూడలేదని, ఆమె అందాలు పిటపిటలాడుతూ మనసు దోచేస్తున్నాయని, ఆమె అందాలకు తాను భక్తుడిని అయిపోయాని, మహిళల అందానికి తాను ఎప్పుడూ భక్తుడినే అంటూ తన మనసులోని మాటలను నర్మ గర్భంగా బయట పెట్టారు.


Click it and Unblock the Notifications











