సెక్సీగా ఎక్స్‌ఫోజింగ్ చేయడం సమాజసేవే అంటోంది!

By Bojja Kumar

ముంబై : సంచలన మోడల్, నటి పూనమ్ పాండే మరోరాసి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను చిన్ని చిన్న దుస్తులు వేసుకుని ఎక్స్ ఫోజింగ్ చేయడాన్ని తప్పుగా భావించడం లేదని, ఇది కూడా ఒక రకంగా సమాజ సేవ అని అంటోంది. నన్ను ఇలాంటి డ్రెస్సుల్లో చూసి జనం ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇది ముమ్మాటికీ సోషల్ సర్వీసే అని వాదిస్తోంది.

ఫోర్న్ సినిమాల నుంచి బాలీవుడ్ సినిమా పరిశ్రమకు మారిన సన్నీ లియోన్‌తో తనను పోల్చడంపై మండి పడుతోంది పూనమ్ పాండే. భవిష్యత్‌లో తనను పోలిస్తే గిలిస్తే....ఆమె అభిమానించే రేఖ, మాధురి దీక్షిత్, కాజోల్‌ లాంటి స్టార్లతో పోల్చాలని మీడియా వారితో వాదన పెట్టుకుంటోంది.

పూనమ్ పాండే వ్యాఖ్యల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే....తను బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న 'నషా' చిత్రం తర్వాత నటిగా తన పేరు మార్మోగిపోతుందని చెప్పకనే చెబుతోంది. మరి నటించం అంతే బట్టలిప్పి అన్నీ చూపించినంత వీజీకాదని పాపం అమ్మడుకి తెలియదేమో?

Poonam Pandey

పూనమ్ పాండే నటించిన తొలి సినిమా 'నషా' ఈ నెలలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. సినిమాకు పబ్లిసిటీ పెంచడానికి ఇప్పటికే రకరకాల గిమ్మిక్కులు ప్రదర్శించిన పూనమ్ పాండే తాజాగా తన న్యూడ్ ఫోటోను లీక్ చేసి మీడియాలో చర్చనీయాంశం అయింది.

నషా' చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత ఆదిత్య భాటియా నిర్మిస్తున్నారు. అమిత్ సక్సేనా ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో అమిత్ సక్సేనా భట్ క్యాంపు నుంచి వచ్చిన 'జిస్మ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. జిస్మ్ సినిమా అప్పట్లో ఓ శృంగార సంచలనం. నషా కూడా అంచనాలకు ఏమాత్రం తగ్గదని అంటున్నారు.

'నషా' చిత్రం 18 ఏళ్ల యువకుడు, 25 ఏళ్ల యువతి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ అభిమానుల్లో ఎన్నో ఆశలు రేపుతోంది. పూనమ్ పాండే పలు సీన్లలో నగ్నంగా నటించడంతోపాటు పడకగది శృంగార సీన్లలో ఇరగదీసినట్లు ఈ ట్రైలర్లో చూపించారు. ఇక సినిమా ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జులై 26న ఈచిత్రం విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X