అజారుద్దీన్ మొదటి భార్యగా బాలీవుడ్ కుర్ర బ్యూటీ
హైదరాబాద్: అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా టోని డిసౌజా ఓ సినిమా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో అజారుద్దీన్ మొదటి భార్య నౌరీన్‌గా బాలీవుడ్ బ్యూటీ ప్రాచి దేశాయి కనిపించనుంది. అజారుద్ధీన్ పాతక్రలో ఇమ్రాన్ హష్మి నటించనున్నారు.
అజారుద్ధీన్ గురించి గానీ, ఆయన క్రికెట్ లైఫ్...,పొలిటికల్ కెరీర్ గురించి నాకు అంతకు ముందు పెద్దగా తెలీదు. ఇపుడు ఆ విషయాలు తెలుసుకుంటున్నానని ప్రాచీ దేశాయ్ తెలిపింది. అజారుద్దీన్ రెండో భార్య సంగీత బిజ్‌లాని పాత్రకు కరీనాకపూర్‌ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

క్రీడాతారల జీవితకథల ఆధారంగా తీసిన చిత్రాలు ఘన విజయాలు సాధిస్తుండడంతో ఈ తరహా చిత్రాలపై బాలీవుడ్ అమితాసక్తి కనబరుస్తోంది. తాజాగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవిత చరిత్ర కూడా తెరకెక్కనుంది. ‘చిత్ర కథను రూపొందించడం కోసం అజార్ భాయ్‌తో మాట్లాడాల్సి ఉంది. క్రీడాకారునిగా అజారుద్దీన్ జీవితం ప్రత్యేకమైంది. సినిమాలో ప్రధానాంశం క్రికెటే అయినా, అజార్ జీవితానికి సంబంధించిన విషయాలే ఎక్కువగా ఉంటాయి' అని హష్మీ చెప్పాడు.
రెండున్నర గంటల్లో అజ్జూ భాయ్ జీవితాన్ని చూపించడం నిజంగా కష్టమేనని అభిప్రాయపడ్డాడు. అందుకు ఎంతో ప్రణాళిక బద్ధంగా వ్యవహారించాల్సి ఉంటుందన్నాడు. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కునాల్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించనున్నాడు.
ప్రస్తుతం ఎలాంటి రోడ్ మ్యాప్ లేదని చెప్పిన ఇమ్రాన్.. నమ్మకం, చిత్తశుద్ధితో ఈ చిత్రాన్ని చేస్తున్నట్లు ఇమ్రాన్ తెలిపాడు. విజయానికి బాక్స్ ఆఫీస్ ఒక్కటే బెంచ్ మార్క్ కాదని చెప్పాడు. అందరిలా కాకుండా తాను కొంచెం భిన్నంగా ఆలోచిస్తానని, సినిమా ఫ్లాప్ అయినా తాను బాధ పడనని చెప్పాడు.


Click it and Unblock the Notifications











