నా గురించి ఆ పుకార్లు ఇకనైనా ఆపండి: రానా
టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి ఆరోగ్యం గురించి కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినపిస్తున్నాయి. దానికి తోడు ఇటీవల రానా తండ్రి సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు కూడా అభిమానుల్లో ఆందోళన పెంచాయి. ఈ నేపథ్యంలో హెల్త్ విషయమై వివరణ ఇస్తూ రానా ట్వీట్ చేశారు.
"నా ఆరోగ్యం గురించి చాలా కొత్త వార్తలను వింటున్నాను. గైస్... నేను బాగానే ఉన్నా. కాస్తంత రక్తపోటు సమస్య ఉంది. అతి త్వరలోనే అంతా బాగుంటుంది. నాపై ప్రేమ చూపుతున్న వారికి కృతజ్ఞతలు. ఇది నా ఆరోగ్యం... మీది కాదు పుకార్లు సృష్టించవద్దు" అని పేర్కొన్నారు.
ఇదివరకూ హైదరాబాద్ మ్యాక్సివిజన్‌లో డా.సతీష్ గుప్తా రానా కుడికంటికి ఆపరేషన్ చేశారు. అయితే తాజాగా అదే కంటికి విదేశాల్లో శస్త్ర చికిత్స చేయించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఈపాటికే కంటి ఆపరేషన్ జరగాల్సింది. రానాకి ఉన్న హై బీపీ వల్ల వాయిదా వేశారట.

రానా ప్రస్తుతం హాతీ మేరీ సాథీ త్రిభాషా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరో మూడు ప్రాజెక్టులు అతడి క్యూలో ఉన్నాయి. రోటీన్ చిత్రాలు చేయకుండా డిఫరెంట్ చిత్రాలు చేస్తూ రానా ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











