»   » సన్నీ లియోన్‌ను దేశం నుండి తరిమి కొడతా...

సన్నీ లియోన్‌ను దేశం నుండి తరిమి కొడతా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ సెక్స్ బాంబ్‌గా, ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రాఖీ సావంత్‌కు....ఇండో కెనడియన్ మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఇండియాలో అడుగు పెట్టినప్పటి నుండి మనశ్శాంతి కరువైంది. ఆమె వచ్చినప్పటి నుండి తనను ఎవరూ పట్టించుకోవడం లేదని తెగ ఫీలయిపోతోంది.

ఈ మధ్య కాలంలో రాఖీ సావంత్ ఎక్కువగా కురచ దుస్తులు వేసుకునే కనిపిస్తోంది. తాను ఇలాంటి దుస్తులు వేయడానికి కారణం సన్నీ లియోన్ అంటోంది. సన్నీ లియోన్ వల్ల సినీ పరిశ్రమలో సెక్సీ నెస్ విషయంలో పోటీ పెరిగింది. అందరూ బికినీలే కావాలంటున్నారు. అందుకే తాను ఇలా చిట్టి పొట్టి డ్రెస్సులు వేస్తున్నాను. సన్నీ లియోన్ ను బాలీవుడ్ నుండి, ఈ దేశం నుండి తరిమి కొట్టడమే తన టార్గెట్, ఆమె తిరిగి ఆమె దేశం వెళ్లి పోవాలి, గతంలో ఏ పని చేసి బ్రతికిందో అలానే చేయాలి అంటూ కామెంట్ చేసింది.

I'm hotter than Sunny Leone: Rakhi Sawant

అంతటితో ఆగకుండా సన్నీ లియోన్ కంటే నేనే చాలా హాట్ అండ్ సెక్సీగా ఉంటాను. సన్నీని తరిమి కొట్టేందుకే తాను ఇలాంటి దుస్తులు వేస్తున్నాను. ఇండియన్స్ ఎవరూ ఇలాంటివి వేయొద్దు అంటూ సెలవిస్తోంది.

గతంలో కూడా ఓ సారి రాఖీ సావంత్ సన్నీ లియోన్ పై విరుచుకు పడింది. ఆమెలా తాను పోర్న్ ఇండస్ట్రీ నుండి రాలేదని, పోర్న్ సినిమాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకోలేదని స్పష్టం చేసింది. పోలిస్తే గీలిస్తే నను మడోన్నా, జెన్నిఫరల్ లోపెజ్ లతో పోల్చండి...నేను కూడా వారిలా డాన్స్, నటన, రియాల్టీ షోల ద్వారా అభిమానులను సంపాదించుకున్నాను అంటూ వ్యాఖ్యానించారు.

English summary
Rakhi said that the Indo-Canadian actress Sunny Leone should return to her country and find work for herself there.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu