»   » ఫుల్ క్లారిటీ : నిజమే ప్రేమలో ఉన్నా... ఇప్పుడే పెళ్లొద్దు!

ఫుల్ క్లారిటీ : నిజమే ప్రేమలో ఉన్నా... ఇప్పుడే పెళ్లొద్దు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సెలబ్రెటీల పెళ్లి కబర్లు,ప్రేమ కబుర్లు ఎప్పుడూ ఆసక్తి కరమే. అందులోనూ ప్రేమ నుంచి పెళ్లి దాకా ప్రయాణం పెట్టుకునేవారంటే మరీను. ముఖ్యంగా ప్రస్తుతం ప్రేమ పేరుతో తిరిగేవాళ్లను మీడియా ఎప్పుడు మీ పెళ్లి అని కంటిన్యూగా అడుగుతూనే ఉంటుంది. అలాంటి భాధితుడు రణ్ బీర్ కపూర్. అతను కనపడగానే పెళ్లి ప్రస్దావనే తెస్తూంటారు. అఫ్ కోర్స్ రణ్ బీర్ కూడా ఎంజాయ్ చేస్తాడనుకోండి. ఒక్కోసారి ఒక్కో భిన్నమైన సమాధానమిచ్చి వార్తల్లో నిలుస్తూంటాడు. అయితే ఈ సారి వారి అంచనాలకు భిన్నంగా సమాధానమిచ్చాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

''నేను ప్రేమలో ఉన్నానంటున్నారు కదా? అవును నిజమే నేను ప్రేమిస్తున్నాను. ఎవర్ని ఏంటి? అనే విషయాలే కాదు నా పెళ్లి తేదీ గురించి మీడియా దయచేసి లేనిపోని ప్రచారాలు చేయొద్దు. పెళ్లి అనేది గొప్ప విషయం. నేను వెండితెరకు వచ్చిననాటి నుంచి ఎన్నోసార్లు నా పెళ్లి తేదీని మీడియానే ప్రకటించేసింది. నా పెళ్లి గురించి ప్రకటించే అవకాశం నాకివ్వండి. ప్రస్తుతానికి అయితే ఎలాంటి పెళ్లి ఆలోచనలు లేవు'' అంటూ ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పాడు రణ్‌బీర్‌ కపూర్‌.

I'm in love: Ranbir Kapoor

రణ్‌బీర్‌ కపూర్‌ అనగానే కత్రినాకైఫ్‌ గుర్తొచ్చేలా వాళ్ల ప్రేమాయాణం గురించి సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇద్దరూ ఒకే అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారని, ఇప్పటికే వీళ్లకు వివాహం జరిగిపోయిందని పుకార్లు షికారు చేశాయి. కానీ ఏ రోజూ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అంటూ రణ్‌బీర్‌, కత్రినాల్లో ఎవరూ బాహాటంగా చెప్పలేదు. కానీ ఇప్పుడు నేను ప్రేమలో ఉన్నానని బహిరంగంగా చెప్పాడు రణ్‌బీర్‌ కపూర్‌. ప్రియురాలు ఎవరో మాత్రం చెప్పలేదు.

ఈ యంగ్ హీరో నటించిన 'రాయ్‌', 'బేషరమ్‌' చిత్రాలు ఆశించిన విజయం అందుకోలేదు. తాజాగా 'బాంబే వెల్వెట్‌'లో నటించాడు. ''సినిమా జయాపజయాలు నా చేతుల్లో ఉండవు. 'బాంబే వెల్వెట్‌' ఎంతో కష్టపడి చేశాం. ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది'' అని చెప్పాడు రణ్‌బీర్‌.

English summary
Ranbir Kapoor has admitted that he is in love and is committed. But at the same time, the actor cleared the air about wedding rumors and stated that he has no plans of walking down the aisle anytime soon.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu