వెల్ కమ్ టు సెంట్రల్ జైల్... అమాయకుడినే అంటూ హీరో గగ్గోలు, ఫ్యాన్స్ దాడి!

నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో హీరో దిలీప్ అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో తాను అమాయకుడిని అని దిలీప్ వెల్లడించారు.

By Bojja Kumar

మలయాళ హీరో దిలీప్‌ను కేరళ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ప్రముఖ మలయాళ హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై దిలీప్ స్పందిస్తూ... తనకు ఏ పాపం తెలియదని, తనను ట్రాప్ చేశారని తెలిపారు.

అరెస్టు అనంతరం దిలీప్‌ను జడ్జిముందు హాజరు పరుచగా 14 రోజుల పాటు జుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో ఆయన్ను కొచ్చి నగర శివారులోని అవులా సబ్ జైలుకు తరలించారు. దిలీప్ లాయర్ మాట్లాడుతూ...బుధవారం బెయిల్ కోసం అప్లై చేయనున్నట్లు తెలిపారు.

దిలీప్ మళయాలంలో థర్డ్ బిగ్గెస్ట్ హీరో. మోహన్ లాల్, మమ్ముట్టి తర్వాత దిలీప్ అక్కడ పెద్ద స్టార్. నటిపై లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసులో తాను అమాయకుడిని అని ఆయన అరెస్టుకు ముందు వ్యాఖ్యానించారు.

'నన్ను ఈ కేసులో ట్రాప్ చేశారు. నాకు ఏ పాపం తెలియదు. నా నిజాయితీ నిరూపించుకుంటాను' అని దిలీప్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన అరెస్టుకు ముందు గుర్తు తెలియని ప్రదేశంలో పోలీసులు ప్రశ్నించారు. అనంతరం ఓ నిర్దారణకు వచ్చిన తర్వాత అరెస్టు చేశారు.

వెల్ కమ్ టు సెంట్రల్ జైల్

వెల్ కమ్ టు సెంట్రల్ జైల్

దిలీప్ అరెస్టు అనంతరం కాస్త హింస చోటు చేసుకుంది. దిలీప్ కు చెందిన వ్యాపారాలపై దాడి జరిగినట్లు సమాచారం. దిలీప్‌ను తరలించిన జైలు వద్ద గుమిగూడిన జనం వెల్ కం టు సెంట్రల్ జైల్ అంటూ నినాదాలు చేశారు. ఆసక్తికరంగా దిలీప్ నటించిన చివరి చిత్రం టైటిల్ కూడా ‘వెల్ కమ్ టు సెంట్రల్ జైల్' కావడం గమనార్హం. 2016లో ఈ చిత్రం విడుదలైంది.

పాత గొడవలే

పాత గొడవలే

కాగా... నటిపై లైంగిక వేధింపులు, కిడ్నాప్ జరుగడానికి కారణం దిలీప్, సదరు నటి మధ్య ఉన్న పర్సనల్ గొడవలే అని, ఆ కక్షతోనే నటిపై దిలీప్ ఇదంతా చేయించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. జుడిలీషియల్ కస్టడీలో ఆయన మరింత స్ట్రాంగ్ గా విచారించబోతున్నారు. అపుడు మరిన్ని నిజాలు బయటకు రానున్నాయి.

ఇప్పటికే పలువురి అరెస్ట్

ఇప్పటికే పలువురి అరెస్ట్

మలయాళ నటిపై ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఈ దారుణం చోటు చేసుకుంది. ఆమె మాజీ డ్రైవర్ పల్సర్ సుని, డ్రైవర్ మార్టిన్ మరికొందరితో కలిసి ఆమె ప్రయాణిస్తున్న కారులోనే ఆమెను కిడ్నాప్ చేసి రాత్రంతా కారులో తిప్పుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. సెల్ ఫోన్లో ఆమెను అసభ్యంగా వీడియో చిత్రీకరించి ఫోటోలు తీశారు. ఈ కేసుకు సంబంధించి పల్సర్ సుని, మరో ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

పక్కా ఆధారాలతో

పక్కా ఆధారాలతో

ఈ కేసుకు సంబంధించిన విచారణలో దిలీప్, ఆయన రెండో భార్యకు హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. పలు సాక్ష్యాలతో ఈ విషయంపై ఒక నిర్దారణకు వచ్చిన అనంతరం అతడికి పక్కా ఆధారాలతో సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో దర్శకుడు నాదిర్షా హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X