twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా భర్త నన్ను జోకర్ అంటున్నారు: శ్రీదేవి

    By Bojja Kumar
    |

    ముంబై: ఒకప్పుడు దేశ సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ శ్రీదేవి చాలా కాలం గ్యాప్ తర్వాత 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5న ఈచిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ తన అనుభూతుల్ని పంచుకుంది.

    తన రీ ఎంట్రీపై తానేమీ నర్వెస్ కావడం లేదని, ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రం విడుదలపై ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నానని శ్రీదేవి చెప్పుకొచ్చారు. తన భర్త బోణి కపూర్, పిల్లల సపోర్టు ఉండటం వల్లనే తాను మళ్లీ సినిమాల్లో నటించ గలిగానని, తనకు తగిన కథలు వస్తే మరిన్ని సినిమాల్లో నటిస్తానని చెప్పారు.

    తన పర్సనల్ విషయాల గురించి వివరిస్తూ.... ఇంట్లో నేనే బాస్, నా భర్త నన్ను జోకర్ అంటుంటారు, ఎందుకంటే నేను ఎప్పుడు జోక్స్ వేసి అందరినీ నవ్విస్తుంటారు. ఇంట్లో అంతా ఎంతో సరదాగా స్నేహితుల్లా ఉంటామని శ్రీదేవి చెప్పుకొచ్చారు. ఇంతకాలం నేను సినిమాలకు దూరమైనందుకు ఏ మాత్రం బాధ లేదు. తల్లిగా పిల్లలను పెంచడంలో ఎంతో ఆనందం ఉందని శ్రీదేవి వెల్లడించారు.

    అమెరికాలో ఒక భారతీయ గృహిణి ఇంగ్లీష్ మాట్లాడేందుకు ఇబ్బందులు పడుతూ ఎదుర్కొన్న అవమానాలు, ఆ తర్వాత ఆమె ఏం చేసింది అనే ఇతి వృత్తంతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో అమితాబ్, అజిత్ అతిథి పాత్రల్లో కనిపిస్తున్నారు. ఎక్కువ భాగం న్యూయార్క్ లో షూటింగ్ జరుపుకుంటున్న 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రంలో శ్రీదేవి, ఆదిల్ హుస్సేన్, ప్రియా ఆనంద్, మెహిదీ నెబ్బో నటిస్తున్నారు. సంగీతం: అమిత్ త్రివేది, సౌండ్: రసూల్ పూకుట్టి, ఫోటో గ్రఫీ: లక్ష్మణ్ ఉటేకర్, ఎడిటింగ్: హేమంతి సర్కార్, నిర్మాతలు: రాకేష్ జుంజుంవాలా, ఆర్.దమని, సునీల్ లుల్లా, ఆర్. బాల్కీ, రచన-దర్శకత్వం: గౌరీ షిండే.

    English summary
    "My Husband calls me a joker! I'm joking all the time. Also, I keep tripping. I'm a brat with my kids and make them laugh, where sometimes they literally have to beg me saying, 'chup ho Jao mamma please'" Sridevi told to TOI.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X