రాజమౌళి ‘ఈగ’లో నటించడమే అదృష్టం

By Bojja Kumar

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఈగ' చిత్రంలో నటించడమే తన అదృష్టమని, తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు రాజమౌళికి థాంక్స్ చెబుతున్నాను అంటూ హీరో నాని వ్యాఖ్యానించారు. ఈగ చిత్రంలో నాని పాత్ర కేవలం 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. దీనిపై ఆయన్ను ప్రశ్నించగా..తొలుత చిన్న పాత్రే అని నిరాశ ఉండేది...కానీ తర్వాత ఒక గొప్ప సినిమాలో ఆవకాశం దక్కిందని ఆనందపడ్డాను అని చెప్పుకొచ్చారు నాని. రేపు 'ఈగ' చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో ఎంతో ఎగ్జైట్‌గా ఉన్నారు నాని.

రాజమౌళితో కలిసి పని చేసిన అనుభవాల గురించి వివరిస్తూ....ఆయన లాంటి టాలెంటెడ్ దర్శకుడిని నేను ఇప్పటి వరకు చూడలేదు, అతని వర్కింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. సినిమానే ఫ్యాషన్‌గా బ్రతుకుతున్న వ్యక్తి, ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయనో గొప్ప నటుడు, మేమేం చేయాలో ఆయనే ఫస్ట్ చేసి చూపుతారు, అందులో సగం చేసినా మేం గొప్పగా నటించినట్లే అని చెప్పుకొచ్చారు నాని. సుదీప్ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన తప్పకుండా ప్రేక్షకులను బయపెడతాడు. సమంత గ్లామర్, నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పారు.

సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది. సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై.. అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా 'ఈగ' కథాంశం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X