గబ్బర్ సింగ్-2: పవన్‌పై సంపత్ నంది సంచలన ప్రకటన
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ‘గబ్బర్ సింగ్-2' చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకుడు. గత కొంత కాలంగా ఈ చిత్రంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు సంపత్ నంది స్క్రిప్టు వర్కు పవన్ కళ్యాన్‌కు నచ్చలేదని...అందుకే పవన్ కళ్యాణే స్వయంగా స్క్రిప్టు వర్కు దగ్గరుండి చూసుకున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. తర్వాత సంతప్ నందిని తప్పించి పవన్ కళ్యాణే సినిమాకు డైరెక్షన్ చేయబోతున్నారంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలతో అభిమానులు అయోమయంలో పడ్డారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు సంపత్ నంది స్పందించారు. ‘గబ్బర్ సింగ్ -2 స్క్రిప్టు ఫైనల్ నేరేషన్ కోసం త్వరలో పవన్ కళ్యాణ్ ను కలవబోతున్నాను. ఆయన్ను కలిసిన తర్వాత ఈ రూమర్లపై క్లారిటీ ఇస్తాను. కొందరు కావాలని నా కెరీర్‌తో ఇలాంటి రూమర్లు ప్రచారంలోకి తెస్తున్నారు. పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి, అతను తన మాట నిలబెట్టుకుంటాడనే నమ్మకం ఉంది' అన్నారు.

సంపత్ నంది మాటలను బట్టి చూస్తే ‘గబ్బర్ సింగ్-2' సినిమా విషయంలో తెర వెనక ఏవో అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నట్లు స్పష్టమవుతున్నాయి. ఎవరో కావాలని సంపత్ నందిని ఈ ప్రాజెక్టు నుండి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు. కావాలని కొందరు నా కెరీర్ తో ఆడుకుంటున్నాు, పవన్ కళ్యాణ్ తన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం ఉందని సంపత్ నంది చెప్పడాన్ని బట్టి.....తెర వెనక ఏదో జరుగుతోందని స్పష్టమవుతోంది. మరి సంపత్ నంది పవన్ కళ్యాణ్‌ను కలిసిన తర్వాత గానీ ఏ విసయం బయట పడే అవకాశం లేదు.


Click it and Unblock the Notifications











