మీడియాపై మండిపడ్డ 'పంజా' విలన్
పంజాలో నెగిటివ్ రోల్ చేసిన జాకీ షరాఫ్ రీసెంట్ గా మీడియాపై మండిపడ్డారు. ఆయన్ని గే అంటూ రాసిన వార్తలపై ఆయన విరుచుకుపడ్డారు. అలాగే లైంగికపరమైన ప్రాధాన్యతలపై ఒక పాకిస్థానీ వైబ్‌సైట్‌కు తాను ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా వచ్చిన వార్తలను బాలీవుడ్ హీరో జాకీ షరాఫ్ తోసిపుచ్చాడు. తాను గేను కాదని స్పష్టం చేశారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ..''దీన్ని మీరు నమ్ముతారా? చివరకు ఎంత వరకు వెళ్లారో చూడండి. ఇంతలా దిగజారిపోకూడదు. ఇలాంటివి ఇంక వద్దు.. దీని గురించి నేను ఏ జర్నలిస్టుతో మాట్లాడలేదు. అలాంటి ప్రకటన చేయలేదు. నేనేమైనా పిచ్చివాడినా?'' అని ఆయన ప్రశ్నించారు. అలాగే..''ఒకరి లైంగిక ప్రాధాన్యతల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా? ఎవరైనా గే ఉంటే ఉండవచ్చు.
నేను మాత్రం కాదు. నిజంగా నేను గేను కాదు. అలాంటి ఒక గాసిప్స్ తో కూడిన వివాదాన్ని వండి వడ్డించిన జర్నలిస్టు నైతికతకు నేను ఆశ్చర్యపోతున్నాను''అని జాకీ అన్నారు. ఇక ఆ వార్తను తను,తన భార్య చూసామని చెప్తూ..''నేనూ నా భార్య(ఆయేషా) ఆ వార్త చూసి నవ్వుకున్నాం. ఒకరినొకరం చూసుకున్నాం. అంతే... పగలబడి నవ్వుకున్నాం...'' అని జాకీ వివరించారు. అయినా ఇలాంటి చెత్త విషయాల గురించి మాట్లాడుకునే బదులుగా గత వారం కన్నుమూసిన బాలీవుడ్ దిగ్గజం దేవానంద్‌ను ప్రజలు స్మరించుకోవటం మంచిదని జాకీ మీడియాకు సలహా ఇచ్చారు. ఇక జాకీ షరాఫ్ కీలక పాత్రలో కనిపించిన పంజా చిత్రం క్రిందటి శుక్రవారం విడుదలైంది. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











