అఖిల్ సినిమాలో తన పాత్ర గురించి నాగ చైతన్య ఇలా...
హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ నుండి త్వరలో నాగార్జున చిన్న కొడకు అఖిల్ హీరోగా లాంచ్ కాబోతున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో సినిమా శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా ఓ గోస్ట్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ‘దోచేయ్' ప్రెస్ మీట్లో నాగ చైతన్య స్పందించారు.
‘అఖిల్ సినిమాలో నేను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవి కేవలం రూమర్స్ మాత్రమే. అందరి లాగే నేను కూడా అఖిల్ సినిమా ఎప్పుడు వస్తుందా...అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. తన తొలి సినిమాలో అఖిల్ ఆల్ రౌండర్ పెర్ఫార్మెన్స్ చూపించబోతున్నాడు' అని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.

అఖిల్ సినిమా విషయానికొస్తే...
కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని హీరోగా నిఖితారెడ్డి సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో యూత్ హీరో నితిన్ ఓ యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 8 అఖిల్ అక్కినేని పుట్టినరోజును పురస్కరించుకొని విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్ రూబెన్స్, ఎస్.ఎస్.థమన్, అమోల్ రాథోడ్, ఎ.ఎస్.ప్రకాష్, రవివర్మ వంటి టాప్ టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చెయ్యాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు. అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











