బ్లూఫిలింస్‌లో నటించినందుకు సిగ్గుపడటం లేదు
ముంబై : తాను గతంలో పెద్దలకు మాత్రమే పరిమితమైన బ్లూ ఫిలింస్‌లో నటించాను. కానీ అందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు. అది నా వృత్తి అని మరోసారి స్పష్టం చేసింది జిస్మ్ 2 హీరోయిన్, ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్. తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...బాలీవుడ్లో తనకు ఆదరణ ఉందని, భారత్ లో తనను అభిమానించే వాళ్లు ఉన్నారని, ఇది తనకు ఎంతో సంతోష కరమైన విషయం అని చెప్పింది.
ఇకపై బాలీవుడ్‌పై దృష్టి పెడతారా? నీలి చిత్రాల్లో నటిస్తారా? అని అడిగిన ప్రశ్నకు సన్నీ లియోన్ స్పందిస్తూ...తనకు సొంతగా అడల్ట్ చిత్రాలు నిర్మించే ప్రొడక్షన్ సంస్థ ఉందని, అయితే ఇకపై తన సొంత బ్యానర్లో నటించనని, కొంత కాలం బాలీవుడ్ పై దృష్టి పెడతానని, ఇక్కడ తనకు ఆఫర్లు బాగానే వస్తున్నాయని చెప్పింది. జిస్మ్ 2 తర్వాత 'రాగిని ఎంఎంఎస్ 2' చిత్రంలో నటించనున్నట్లు సన్నీ లియోన్ వెల్లడించింది.
మీ తొలి బాలీవుడ్ చిత్రాన్ని మీ పేరెంట్స్ చూశారా? అని అడగ్గా....నా తల్లిదండ్రులు ఇప్పుడు జీవించి లేరు. ఒక అన్నయ్య ఉన్నాడు. అతనికి హిందీ పెద్దగా అర్థం కాదు. నా స్నేహితులు, సన్నిహితులు అంతా లాస్ ఏంజిల్స్ లోనే ఉంటారు. వారికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో కూడిన జిస్మ్ 2 చిత్రం ప్రత్యేకంగా చూపిస్తానని చెప్పింది.
బాలీవుడ్‌లో భవిష్యత్‌పై పెద్దగా డ్రీమ్స్ ఏమీ లేవని, ఇక్కడ అవకాశాలు ఉన్నన్ని రోజులు నటిస్తానని సన్నీ లియోన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం హిందీ నేర్చుకునే పనిలో ఉన్నానని, త్వరలోనే హిందీ బాషపై పట్టు సాధినని చెప్పింది ఈ హాట్ లేడీ.


Click it and Unblock the Notifications











