రజఃనీ ‘రాణా’ సినిమా గురించి తెలియదు : దీపిక
బాలీవుడ్ హాట్ లేడీ దీపిక పడుకొనే ఏం మాట్లాడినా అది హెడ్ లైన్స్ లోకి ఎక్కుతుంది. ఆమె పర్సనల్ లైఫ్ ఎప్పడూ ఎఫైర్లతో గంధర గోళంగా ఉంటుంది. బహుషా ఆ ఎఫైర్లే కాబోలు ఆమెకు ఇంత క్రేజ్ తేవడంతో పాటు, బాలీవుడ్ లో వరుస అవకాశాలు తెచ్చి పెడుతున్నాయి. ప్రస్తుతం దీపిక సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 'రాణా" సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇటీవల ఈ సినిమా గురించి అడిగిన ప్రశ్నకు....దీపిక నుంచి వచ్చిన సమాధానం విని బిత్తర పోవడం మీడియా ప్రతినిధుల వంతైంది.
'రాణా" సినిమా వ్యవహారం ఎక్కడి వరకు వచ్చిందో? ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందో? లాంటి విషయాల గురించి...దీపికకు ఏమీ తెలియదట. దర్శక నిర్మాతలు కూడా తనకు ఏమీ చెప్పడం లేదని సమాధానం ఇచ్చింది. అందుకే నేను ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందా? అని వెయిట్ చేయకుండా...ఇతర అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెలుతున్నానంటూ చెప్పుకొచ్చింది.
ఇటీవల విడుదలైన ఆరక్షన్ సినిమా దీపికకు పెద్దగా పేరు తేలేదు. ఆ సినిమాలో దీపికది గ్లామర్ రోల్ కాక పోవడమే ఇందుకు కారణం. అందుకే ఆ సినిమా హిట్టయినా అమ్మడు ముఖంలోసంతోషమే లేదు. డిఫెరెంట్ రోల్స్ చేయడం అంటే ఇష్టం. కానీ లవ్ స్టోరీలు అయితే నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని స్టేట్‌మెంట్స్ ఇస్తోంది. 'కార్తీక్ కాలింగ్ కార్తీక్" సినిమాలో తాను బోడి గుండుతో నటిస్తున్నాననే వార్తలను దీపిక ఖండించిది. అందులో షార్ట్ హెయిర్ తో కనిపిస్తానంటే అంటూ వివరణ ఇచ్చింది. దీపిక ప్రస్తుతం దేశీ బాయ్స్ చిత్రంలో నటిస్తోంది. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాంలు ఇందులో లీడ్ రోల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











