లవ్ స్టోరీసంటే హస్యమంటున్న భామామణి
తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని నటి సోనమ్ కపూర్ తెగేసి చెబుతోంది. తాను షాహిద్ కపూర్, దర్శకుడు పునీత్ మల్హోత్రాతో డేటింగ్ చేసినట్లు వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. మల్హోత్రా దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో ఆ 26 ఏళ్ల భామ నటించింది. తనకు ప్రేమకథలంటే అసహ్యని చీదరిస్తోంది. మౌసమ్ సినిమాలో షాహిత్ కపూర్‌తో నటించడంతో వారిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందనే ఊహాగానాలు చెలరేగాయి.
తన గురించి అత్యంత హాస్యాస్పదమైన ఊహాగానాలు చెలరేగుతున్నాయని, తాను థాయ్‌లాండ్‌లో ఉన్నానని, ఊహాగానాలు నవ్వు తెప్పించేవిగా ఉన్నాయని ఆమె ట్వీట్ చేసింది. షాహద్ కపూర్ విషయంలో గానీ పునీత్ మల్హోత్రా విషయంలో గానీ తాను పిచ్చి దాన్ని కాలేదని చెప్పింది. తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నానని, అంతకు మించి ఏమీ లేదని స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications











