twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యడ్యూరప్ప కొడుకుతో లింక్ లేదు: 'పిల్ల జమీందార్' హీరోయిన్

    By Srikanya
    |

    పిల్ల జమీందార్, తకిట తకిట చిత్రాలతో తెలగు వారికి పరిచయమైన హరిప్రియ ఇప్పుడు కన్నడ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇంటిపై సిబిఐ దాడుల జరిగిన నేపధ్యంలో ఆమె ఇంటిమీద కూడా దాడులు జరిగే అవకాశముందని వార్తలు వినిపించాయి. దానకి కారణం..ఆమె యడ్యూరప్ప కుమారుడు విజియేంద్రని గత కొంత కాలంగా డేటింగ్ చేస్తోందని వినపడటమే. ఈ నేపధ్యంలో అవన్నీ రూమర్స్ అని,అతనితో డేటింగ్ లాంటివేమి లేవని ఆమె కొట్టిపారేసింది.

    అలాగే నా ఇంటిమీద సిబిఐ దర్యాప్తు జరగలేదు. మీడియాలో చెప్తున్నట్లుగ నా ఇల్లు సదా శివ నగర్ లో లేదు. నేను యశ్వంత్ పూర్ లో ఉన్నాను. నేను మీడియాలో వార్తలు చూసి షాక్ అయ్ాయను. నేను యడ్యూరప్పని ఎరగను, ఆయన ఇద్దరు కుమారులు సంగతి తెలియదు. మీడియా వారు చెప్తున్న విజియేంద్రతో పరిచయం కూడా లేదు. ఇవన్నీ మీడియాలో ప్రచారం చేసి నా ఇమేజ్ ని దెబ్బ తీయటానికి చేస్తున్న కుట్ర అంది.

    నేను మనస్సుగల మట్టు ముద్ర,కల్లార సంతు చిత్రాలు చేస్తున్నప్పుడు కొన్ని టాబ్లాయిడ్స్ ఈ రూమర్స్ ని ప్రచారం చేసాయి. మళ్లీ నా కిలాడి కిట్టి విడుదలకు సిద్దమవుతున్న సందర్బంలో ఇలాంటి రూమర్స్ ప్రచారంలోకి రావటం దురదృష్టకరం. ఇలాంటివి రాసేటప్పుడు,ప్రసారం చేసేటప్పుడు మీడియా సమన్వయం వహించాలి. ఖరారు చేసుకోనిదే ప్రసారం చేస్తే మా వ్యక్తిగత జీవితాలు దెబ్బతింటాయి. మా కుటుంబాల వాళ్లకు సమాధానం చెప్పుకోలేని స్దితి వస్తుంది అంది.

    ఇక నేను కొనుక్కున్న ఇల్లు,నా కారు నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొనుగోలు చేసినవే. నేను సినిమాల్లో నటించి ఫీజ్ క్రింద తీసుకున్న డబ్బు మాత్రమే అది. నాకు అవన్నీ ఫ్రీగా వస్తే నేను సినిమాల్లో నటించాల్సిన అవసరం ఏముంది. కొంతమంది నేను మెల్లిగా ఇక్కడ సెటిల్ అయ్యి ఎదుగుతున్నాననే బాధతో,అసూయతో చేస్తున్న పని ఇది. ఇలా ప్రచారం చేసి నా పరువు పోగొట్టి నా అవకాశాలు తప్పించాలని చూస్తున్నారు. నేను నాలుగు భాషల్లో నటిస్తున్నాను. నాకు తెలుసు ఈ రూమర్స్ ఎవరు ప్రచారం చేస్తున్నారో..సమయం వచ్చినప్పుడు నేను తప్పకుండా వారి పేర్లు బయిటపెడతాను అని వార్నింగ్ ఇచ్చింది.

    English summary
    Following the CBI raid on former Karnataka chief minister BS Yeddyurappa's and his kin residences on Wednesday (May 16), the television media speculated that actress Haripriya's house also came under the scanner. It was said that she was dating the son of tainted minister, BS Vijayendra. However, she has rubbished the rumors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X