వ్యభిచారం కేసు: నేను కాదంటూ శ్రీదివ్య ఆవేదన
హైదరాబాద్: ఇటీవల వ్యభిచారం కేసులో దివ్యశ్రీ అనే సినీ నటి పట్టుబడిన సంగతి తెలిసిందే. గుంటూరులో దివ్యశ్రీ వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడింది. ఆమె బిటెక్ బాబు చిత్రం హీరోయిన్. అయితే కొన్ని మీడియా సంస్థలు....పొరపాటున శ్రీదివ్య పేరును, ఫోటోను ప్రచురించాయి. వాస్తవానికి శ్రీదివ్య, దివ్యశ్రీ వేర్వేరు.

శ్రీదివ్య మన మన తెలుగమ్మాయి. హైదరాబాద్‌లో పుట్టింది. తెలుగు సినిమాలైన మనసారా, బస్టాప్, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు తదితర చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. హనుమాన్ జంక్షన్, యువరాజ్, వీడే లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కూడా చేసింది. కొన్ని మీడియా సంస్థలు, వెబ్ సైట్లు చేసిన పొరపాటు కారణంగా శ్రీదివ్య ఇబ్బందుల్లో పడింది.
పోలీసులు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. వ్యబిచారం కేసులో పట్టుబడిన దివ్యశ్రీ బీటెక్ బాబు చిత్రంలో హీరోయిన్ గా నటించిందని తెలిపారు. బస్టాప్ హీరోయిన్ శ్రీదివ్యకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యభిచార కేసు కారణంగా శ్రీదివ్య మనోవేదనకు గురవుతోంది. తన పేరును, ఫోటోను వెంటనే తొలగించాలని వేడుకుంటోంది.


Click it and Unblock the Notifications











