రామ్ చరణ్‌తో నో ఐటం: శృతి హాసన్
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-వివి వినాయక్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'నాయక్'. కాజల్, అమలపాల్ హీరోయిన్లు. గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈచిత్రంలో స్పెషల్ ఐటం సాంగులో కనిపించబోతోందనే వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ పుకార్లే అని తేలి పోయింది.
ఈ విషయమై శృతి హాసన్ తన మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో స్పందిస్తూ...'నేను తెలుగులో ఏ ఐటం సాంగు చేయడం లేదు. రవితేజ కలిసి చేయబోయే 'బలుపు' చిత్రంపైనే దృష్టి పెట్టాను, చాలా బిజీగా గడుపుతున్నాను, పుకార్లను నమ్మ వద్దు' అని స్పష్టం చేసింది.
బలుపు చిత్ర విషయాల్లో వెళితే...పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ పొట్లూరి నిర్మించనున్న ఈ చిత్రం షూటింగుకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్లో ఈచిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా సెలక్ట్ అయింది. సంగీత దర్శకడు తమన్ ఈ చిత్రానికి సూపర్ హిట్ ఆడియో అందించేందుకు కృషి చేస్తున్నాడు.
మరో వైపు శృతి హాసన్.. నిఖిల్ అద్వానీ తీయబోయే 'డి డే' సినిమాలోనూ నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇందులో అర్జున్ రామ్‌పాల్ సరసన శ్రుతి కనిపించబోతోంది. మూడేళ్ల కిందట 'లక్' చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన శృతి హాసన్‌కు హిట్ దక్కలేదు. తరవాత మధుర్ బండార్కర్ రూపొందించిన 'దిల్ తో బచ్చా హై జీ' సినిమాలో ఓ హీరోయిన్ గా చేసింది. అయితే అది కూడా ఆమెకు నిరాశను మిగిల్చింది. దీంతో హిందీ సినిమాల వైపు చూడకుండా దక్షిణాదిన తన అదృష్టాన్ని పరీక్షించుకొంది. ఇటీవలే 'గబ్బర్ సింగ్'తో విజయాన్ని అందుకున్న ఈ భామ ఇప్పుడు హిందీలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











