'మగధీర' హిందీ రీమేక్ విషయమై స్పందించిన రాజమౌళి
మగధీర చిత్రం త్వరలో హిందీలో రీమేక్ కానుందని, దానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నం సంగతి తెలిసిందే. అంతేగాక రణబీర్ కపూర్,కత్రినా కైఫ్ ఈ చిత్రంలో జోడీ గా చేస్తున్నారని ఓ ఇంగ్లీష్ దినపత్రిక రాసుకొచ్చింది. ఇక రాజమౌళి ఈ విషయమై స్పందించారు. తాను హిందీలో ఆ చిత్రాన్ని రీమేక్ చేయడం లేదని, ప్రస్తుతం ఈగ చిత్రంతో బిజీగా వున్నానని, ఆ తర్వాత ప్రభాస్ తో ఓ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నానని అన్నారు. నాని, సమంత జంటగా నటిస్తున్న ఈగ సినిమాలో కన్నడ నటుడు సుదీప్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కు అధిక ప్రాధాన్యత వుండే ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని సాయి నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











