మీ జిమ్మడ..!(పెళ్లి వార్తలపై కరీనా ఫైర్)
బాలీవుడ్ ప్రేమ పక్షులు సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ త్వరలో ఓ ఇంటి వారవుతున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు వినిపించిన ప్రతిసారీ తమ పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటూ సైఫ్, కరీనా ఖండించడం ఈ మధ్య పరిపాటి అయిపోయింది. అయితే ఇటీవల మాత్రం వీళ్లికి సంబంధించిన వార్తలు మరోసారి బలంగా వినిపించాయి. 2012 ఫిబ్రవరిలో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వాళ్ల సన్నిహితులు చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆలోపే సైఫ్ తండ్రి మన్సూర్ అలీఖాన్ పటౌడీ మరణించడంతో మళ్లీ వీళ్ల పెళ్లి పెండింగులో పడినట్లు కూడా వార్తలొచ్చాయి.
ప్రస్తుతం సైఫ్ తండ్రి బాధ్యతలను భుజాలపైకి ఎత్తుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదామని అతను భావిస్తున్నట్లు సర్వత్రా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సైఫ్-కరీనా జంటగా సైఫ్ స్వీయ దర్శకత్వంలో ఏజెంట్ వినోద్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు, కరీనా 'హీరోయిన్" సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలు ఫిబ్రవరిలోగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చిలో వీళ్ల పెళ్లి ఉంటుందని మరోసారి....వీళ్ల పెళ్లి మ్యాటర్ తెరపైకి వచ్చింది.
ఈ వార్తలపై కరీనా కపూర్ మండి పడింది. తాము పెళ్లి చేసుకోబోతున్న మాట వాస్తవేకానీ ఇంకా డేట్ ఫిక్స్ కాలేదని, పెళ్లికి ఇంకా చాలా సమయం ఉందని స్పష్టం చేసింది. తాము ఎలాంటి ప్రకటన చేయకుండా వార్తలు ప్రసారం చేస్తున్న మీడియాపై బెబో ఆగ్రహం వ్యక్తం చేసింది. మా ప్రమేయం లేకుండా మీరే పెళ్లి చేసి, మీరే హీనీమూన్ కి పంపిస్తారా? అంటూ చిటపటలాడింది. కరీనా ధోరణి చూస్తుంటే వీళ్ల పెళ్లి వచ్చే ఏడాది కాదు కదా, ఆ మరుసటి ఏడాది కూడా జరిగే దాఖలాలు కనిపించడం లేదు. అయినా పెళ్లి అయితే ఎంత కాకుంటే ఎంతలెండి. ప్రస్తుతం ఇద్దరు భార్య భర్తల మాదిరే కలిసి సహజీవనం చేస్తున్నారు కదా...


Click it and Unblock the Notifications











